2016 నుండి భారత పౌరసత్వాన్ని వదులుకున్న7 లక్షల మంది

ఇదే సమయంలో భారత పౌరసత్వాన్ని తీసుకున్న 6 వేల మంది

న్యూఢిల్లీ : గత 6 సంవత్సరాలలో ఏడున్నర లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2016 నుంచి 2021 మధ్య కాలంలో 7,49,765 మంది పౌరసత్వాన్ని వదులుకున్నట్టు విదేశాంగశాఖ రాజ్యసభలో వెల్లడించింది. మన పౌరసత్వాన్ని వదులుకున్న వారంతా 106 దేశాల్లో స్థిరపడ్డారని తెలిపింది. 2019లో అత్యధికంగా 1,44,017 మంది పౌరసత్వాన్ని వదులుకోగా… 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049 మంది, 2018లో 1,34,561 మంది, 2020లో 85,248 మంది, 2021లో 1,11,287 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. మరోవైపు ఇదే కాలంలో దాదాపు 6 వేల మంది భారతీయ పౌరసత్వాన్ని తీసుకున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/