హైకోర్టు సీజేగా జస్టిస్ సతీష్‌చంద్రశర్మ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం రాజ్‌భవన్‌లో జస్టిస్ సతీష్ చంద్రశర్మచే గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ , ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

జ‌స్టిస్ స‌తీష్‌చంద్ర ప్ర‌మాణ‌స్వీకారం చేసిన అనంత‌రం ఆయ‌న‌కు గ‌వ‌ర్న‌ర్, సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేసిన విష‌యం విదిత‌మే. దీంతో శనివారం కేంద్ర న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/