ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

Accident
Accident

నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 25 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే వారిని చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు పెనుగంచిప్రోలు మండలం గమ్మిడిదల గ్రామ వాసులుగా గుర్తించారు. వారు వ్యవసాయ పనుల కోసం దేసినేనిపాలెం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/