హుస్సేన్ సాగర్ గణేష్ నిమజ్జనానికి సుప్రీం కోర్ట్ గ్రీన్ సిగ్నల్

హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి సుప్రీం కోర్ట్ అనుమతి ఇచ్చింది. గత కొన్ని ఏళ్లుగా గణేష్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి మాత్రం పీవోపీ వినాయక విగ్రహాలను సాగర్ లో నిమజ్జనం చేయొద్దని, దగ్గరలోని చెరువులలో , కుంటలలో నిమజ్జనం చేయాలనీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ ఒక్క ఏడాదికి హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి మినహాయింపుని ఇవ్వాలంటూ అభ్యర్థించింది. ట్యాంక్ బండ్ మీదుగా నిమజ్జనం చేసేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్‌లో జీహెచ్ఎంసీ కోరింది. ఈ అంశం ఫై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఏడాదే చివరి ఛాన్స్. వచ్చే ఏడాది నుండి పీవోపీ వినాయక విగ్రహాలను సాగర్ లో నిమజ్జనం చేయకూడదని తేల్చి చెప్పింది. ఈ తీర్పు తో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. సుప్రీం నుండి సానుకూల తీర్పు వస్తుందని ముందే భావించారు. వారు భావించినట్లే తీర్పు రావడం తో గణేష్ భక్తులంతా సంబరాలు చేసుకుంటున్నారు.