రాజు ఆత్మహత్య చేసుకోవడం ఫై కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే

గత వారం రోజులుగా 1000 మంది పోలీసులను చెమటలు పట్టించిన కామాందుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారి ఫై అత్యాచారం చేసి , చంపేసి పారిపోయిన రోజు..8 వ రోజు ఉదయం స్టేషన్ ఘనపూర్ రైల్వే ట్రాక్ ఫై ఆత్మ హత్య చేసుకున్నాడు. రాజు ఆత్మ హత్య చేసుకున్నాడనే వార్త బయటకు రాగానే అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజు కుటుంబ సభ్యులు మాత్రం రాజు ఆత్మహత్య చేసుకోలేదని , చంపేశారని వాపోతున్నారు.

మరోపక్క చిన్నారి తండ్రి మాత్రం..రాజు మృతదేహాన్ని కాలనీ కి తీసుకరావాలని..మీము , కాలనీ వాసులం రాజు మృత దేహాన్ని చూస్తామని..చూసిన తర్వాతే అది రాజు మృత దేహమా కదా అని చెపుతామని అంటున్నారు.

ఇక రాజు విషయానికి వస్తే..రాజుకు తండ్రి లేకపోవడంతో తల్లి కూలీ పనులు చేస్తూ కొడుకును పోషించింది. కేవలం 3వ తరగతి వరకే చదివిన రాజు ఎక్కువగా హైదరాబాద్‌లో ఉంటాడని దర్యాప్తులో తేలింది. అప్పుడప్పుడు సొంతగ్రామమైన జనగామ జిల్లా కొడకొండ్లకు వెళ్లొస్తుంటాడని చుట్టుపక్కల వారు పోలీసులకు వివరించారు. లేబర్ అడ్డాల్లోనూ రాజు ఒకరిద్దరితోనే మాట్లాడతాడని.. వాళ్లతో కలిసి కూలీ పనిచేయగా వచ్చే సొమ్మును పంచుకుంటారని పోలీసుల దర్యాప్తులో తేలింది.