స్టార్టప్‌ కంపెనీలను ఆదుకోవాలి

కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్ర ప్రభావం

Startup companies
Startup companies

ఉప్పెనలా ముంచుకొచ్చిన కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌ ఇప్పుడు స్టార్టప్‌ కంపెనీలపై పడింది. ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రంగాలను అతలాకుతలం చేసినట్టే స్టార్టప్‌ సంస్థలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

ఫలితంగా దేశం లో 70 శాతం స్టార్టప్‌లకు నిర్వహణావ్యయం ఇంకా మూడు నెలలకు మించి లేదని ఒక అధ్యయనంలో తేలింది. ఇది ఆందోళనకరం.

దేశంలో సేవల రంగంలో ఉన్న స్టార్టప్‌ కంపెనీలు పెను విప్లవం సృష్టించాయి. విదేశీ పెట్టుబడులను సైతం సొంతం చేసుకున్నాయి. కొత్త ఉద్యోగాల్ని లక్షల సంఖ్య లో సృష్టించగలిగాయి.

నలభై ఏళ్లు కూడా నిండని స్టార్టప్‌ మేనేజర్లను బిలియనీర్లుగా మార్చేశాయి. ఇదంతా కరోనా ముందు వరకు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమైపోతోంది.

దేశంలో రవాణా, పర్యాటక, ఆర్థిక, వ్యవసాయ సాంకేతిక సేవల్లోని స్టార్టప్‌ కంపెనీలు క్లిష్టపరిస్థితుల్లోకి వెళ్లాయి. సంస్థల పునరుజ్జీవం ఆందోళనకరంగా తయారైంది.

ఈ క్లిష్టపరిస్థితుల్లో కేంద్ర, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు స్వయంగా రంగంలోకి దిగి ఆదుకుంటే తప్ప సంస్థల మనుగడ కష్టంగా కనిపిస్తోంది.

ఒక వేళ సంస్థలు నిలదొక్కుకోకుంటే లక్షల ఉద్యోగాలు హుష్‌కాకీ అవుతాయి.

ఇటీవల ఒక సంస్థ దేశవ్యాప్తంగా 250 అంకుర సంస్థల పరిస్థితులపై నెల రోజులపాటు సర్వే నిర్వహించింది.

కరోనా ప్రభావం వల్ల దేశంలోని దాదాపు 50 శాతం సంస్థలకు సత్వరం ప్రభుత్వ సహాయం చేయాల్సిన అవసరం ఉందని ఆ సర్వేల్లో వెల్లడైంది. క

రోనా మహమ్మారివల్ల 90శాతానికిపైగా స్టార్టప్‌ సంస్థల ఆదా యం పడిపోయింది.

34 శాతం సంస్థలు 80శాతానికి పైగా ఆదాయం కోల్పోయా మని సర్వేలో వెల్లడి కావడం పరిస్థితి తీవ్ర తను బట్టబయలు చేస్తోంది.

మెట్రోనగరాల్లోని సంస్థలకు ఆదాయం దాదాపు 50 శాతం తగ్గిపోయింది.

కరోనా సమయంలో కేవలం విద్య,వైద్య, ఆర్థికసేవల రంగాల్లోని స్టార్టప్‌ల ఆదాయం మాత్రం పెరిగినట్టు కనిపించినా వరుస లాక్‌డౌన్‌లతో వాటికి కూడా స్థిరత్వం లేకుండాపోయింది.

ఇప్పటికే భారీ పెట్టుబడులతో నిలదొక్కు కున్న సంస్థల భవితవ్యానికి ఢోకా లేకున్నా మిగిలిన 90శాతం సంస్థల పరిస్థితి కష్టంగా మారింది.

వ్యాపార వినియోగ విధానం లోని సంస్థలకు మానవ వనరుల కొరత నెలకొంది. కొన్నింటి ఆర్డర్లు రద్దవ్ఞతున్నాయి.

ఆదాయం తగ్గడం వల్ల ప్రతి నాలుగు సంస్థల్లో మూడింటిలో మనుగడ కోసం మార్కెటింగ్‌ ఖర్చులు తగ్గించి సిబ్బంది వేతనాల్లో కోతలు విధించే దుస్థితి నెలకొంది.

ప్రస్తుతతరుణంలో స్టార్టప్‌ కంపెనీలను సజీవంగా నిలదొక్కుకునే విధంగా కాపాడాలంటే కేంద్రప్రభుత్వం గత రెండేళ్ల జిఎస్టీని రిఫండ్‌ చేయడంతోపాటు వచ్చే రెండేళ్లపాటువిరామం ఇవ్వవల సిన అవసరముంది.

దీనికితోడు కేంద్ర, ఆయారాష్ట్రాల ప్రభుత్వ టెండర్లలో కొన్నింటిని ప్రత్యేక కేటగిరికింద స్టార్టప్‌లకే కేటాయి స్తే వాటికి ఊరటకలుగుతుంది.

మౌలిక సదుపాయాలు తక్కువ ధరలకు కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే మంచిది.

టాప్‌పొజిషన్లో ఉన్న ఐటికంపెనీలు స్టార్టప్‌లకు సబ్‌ కాంట్రాక్టు లు ఇచ్చేలా చర్యలుతీసుకోవాలి.

స్టార్టప్‌ కంపెనీలకు, ఆయా సంస్థల నిర్వహకులకు సులభపద్ధతుల్లో రుణాలు పొందే అవకా శమిస్తే గండం గట్టెక్కేఅవకాశముంది.

  • శ్రీనివాస్‌గౌడ్‌ ముద్దం

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/