సేంద్రియ వ్యవసాయమే మానవాళికి శ్రీరామరక్ష

దేశంలో ఆకలికేకలకు ఆస్కారమే ఉండదు…

భారత్‌లో బాలల ఆకలికేకలు నిరవధికంగా వినబడుతూనే ఉన్నాయి. అన్నార్తుల కష్టాలు ఇప్పట్లో ఆగిపోయే పరిస్థి తులు కనుచూపుమేరలో కన్పించడం లేదు. భారత్‌లో అయిదేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహార లోపం వలన సంభవించే మరణాలు, ఎదుగుదల లోపించడం, వయసుకు తగ్గ ఎత్తు పెరగకపోవడం బరువ్ఞ తక్కువగా ఉండటం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తే 117 దేశాల ఆకలి సూచి జాబితాలో భారత్‌ 102వస్థానంలో నిలబడడమే అందుకు నిదర్శనం.

Indian Agriculture
Indian Agriculture

భారత్‌ తొమ్మి దో దశకం నుంచి పేదరికం సగానికి సగం తగ్గిందని ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) ప్రపంచ బ్యాంకు వ్యాఖ్యా నించింది. అయినప్పటికీ దేశంలో ఆకలి కేకలు ఆగకపోగా గడచిన మూడేళ్లుగా పెరిగిపోవడం గమనార్హం. ఆకలి సూచిలో పొరుగు దేశాలైన పాకిస్థాన్‌ 94, బంగ్లాదేశ్‌ 88, నేపాల్‌ 73, మయన్మార్‌ 69, శ్రీలంక 66వ స్థానంలో కొనసాగుతున్నాయి. భారత్‌లో ఆకలికేకలకు ప్రపంచంలోనే అత్యధిక జనాభానే కారణమని చెబుతున్నా, భారత్‌ కంటే మరింత ఎక్కువ జనాభా కలిగిన చైనా 25వ ఆకలి సూచిగా నమోదుకావడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.

అనూహ్య వాతావరణ మార్పులు, భూతాపం అధికం కావడం వల్ల భారత్‌తో సహా దక్షిణాసియా దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులు సగానికి సగం తగ్గిపోయాయని ప్రపంచ బ్యాంకు నిరవధికంగా హెచ్చరిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుస్థిరా భివృద్ధి సాధనలో వాతావరణ మార్పులు, జనాభా పెరుగుదల తోపాటు పంటలసాగు విస్తీర్ణం పెరగకపోవడం, పంటదిగుబడుల్లో వృద్ధినమోదుకాకపోవడం, ఆహార ఉత్పత్తి, పంపిణీలలో అంత రాలు కొనసాగుతుండడం వల్ల ఆహారకొరత ఏర్పడి, అస్తవ్యస్త ఆహార పంపిణీలో ఏర్పడ్డ అవకతవకలతో అధికశాతం ప్రజానీ కానికి ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.

మధ్యాహ్న భోజనం ఐసిడిఎస్‌ ప్రజాపంపిణీ వ్యవస్థలన్నింటిని ఒకే గొడుకు కిందకు తెస్తూ 2013లోనే ఆహార భద్రత చట్టాన్ని తెచ్చినప్పటికి రాష్ట్రాలు దాన్ని పూర్తిస్థాయిలో అమలుపరచడం లేదు. ఆహారోత్పత్తులను సక్రమంగా గ్రేడింగ్‌ చేయకపోవడం వలన ప్రభుత్వ గిడ్డంగులలో శీతలీకరణలేని గోదాములు, ఆహారోత్పత్తుల పంపిణీలో లోసుగులకు తోడు ఆహార ధాన్యాల్లో మూడోవంతు నష్టపోవాల్సి వస్తోంది. ప్రకృతి విపత్తులు, పర్యావరణ సమస్యలు సైతం ఆహార భద్రతకు సవాళ్లు విసురుతున్నాయి. రైతు నికృష్ణ జీవి. పంటసాగుకు ప్రకృతి వనరులు అనుకూలిస్తే తప్ప ప్రకృతి విపత్తులు, పర్యావరణ సమస్యలు సైతం ఆహార భద్రతకు సవాళ్లు విసురుతున్నాయి.

వరదలు, కరవ్ఞలు, కాటకాలు పంటనష్టానికి కారకాలవ్ఞతున్నాయి. పంట అందివచ్చే సమయంలో ఆకస్మిక వర్షాలు అన్నదాతల పాలిట శాపంగా మారుతోంది. ఈ దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరవ్ఞ కాటకాల మూలంగా సేద్యయోగమైన భూమిలో 50 శాతం సాగునీరు అందడం లేదు. ఈ కారణంగా భూములు బీడువారి సహజ పంటలేకుండా మరే రకమైన పంటలకు కూడా సాగునీరు, భూగర్భజలాలు సైతం అందకుండా పంట భూములు బీడువారుతున్నాయి.

రైతులు పంట ఉత్పత్తులను అధికంగా రాబట్టాలన్న దిశగా విచ్చలవిడిగా రసా యనిక ఎరువ్ఞలు వెదజల్లడం వల్ల పంటరాబడి అటుంచి ఉత్పత్తి అయిన ధాన్యంలో విషరసాయన శకలాలు, భూమి రసాయనిక చర్యతో నిస్సారవంతం కావటం, నిండుగా వర్షాలు పడిన తరు ణంలో ఆ రసాయనిక అవశేషాలు నీటి ద్వారా కాలువల్లో ప్రవ హించి జలాశయాలు కాలుష్యకాసారాలవ్ఞతున్నాయి. చీడపీడల మందులు, రసాయనిక ఎరువ్ఞల అవశేషాలు మానవాళి ముఖ్యం గా ఎదుగుదలలో ఉన్న పిల్లల ఆరోగ్యాన్ని హరిస్తూ వారి ప్రాణా లను బలిగొంటున్న వైనం హృదయవిదారకం.

వాతావరణ మార్పు లు, ప్రకృతి విపత్తులు ఇదే రీతిలో కొనసాగితే భవిష్యత్తులో ప్రజల జీవన స్థితిగతులు, ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదముంది.ప్రతి ఏటా పేదరికం సన్నగిల్లుతుందని వివిధ సంస్థల అధ్యయనాలు పేర్కొంటున్నా గుప్పెడు మెతుకులకు నోచుకోని అన్నార్తులు, అభాగ్యులు పెరుగుతూనే ఉన్నారు. ప్రత్యేకించి మహిళలు, చిన్నారులను పౌష్టికాహార లోపాలు కృంగదీస్తున్నాయి. 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలు దాదాపు సగం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.

పౌష్టికాహారలోపం, తాగునీరు, పారిశుద్ధ్య లోపం, అతిసారం, మలేరియా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, విషజ్వరాలు ప్రబలి ఎంతో మంది విద్యార్థులు, జనాలు వ్యాధుల బారినపడి కన్నుమూస్తున్నారు. సమగ్ర మాతాశిశుసంరక్షణ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు జరగక పోవడంవల్ల గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యహీనతపై ఆ ప్రభావం పడుతోంది. ఆహారోత్పత్తుల కోసం రసాయనిక ఎరువ్ఞల మీద పూర్తిగా ఆధారపడకుండా సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల రైతులకు సాగు పెట్టుబడులు తగ్గడమేకాకుండా విలక్షణమైన పోషకాహార విలువలుగల ధాన్యాన్ని, కాయగూరల్ని, తృణధాన్యాల్ని పండించే అవకాశాలు బోలెడన్ని ఉన్నాయి.

నిస్సారమైన భూమి గుల్లబారడం విషరసాయనాల అవశేషాలు సేంద్రియ సేద్యంలో చొరబడే వీలులేదు. పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిచ్చే దిశగా పయనించడం వలన ప్రకృతి విపత్తులు రాకుండా సాగుభూములకు నీటి ఆసరా కల్పిస్తే వ్యవసాయక దేశంలో ఆకలికేకలకు ఆస్కారమే ఉండదు.

  • దాసరి కృష్ణారెడ్డి

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/