సూత్రధారుల భరతం పట్టాలి
ఎన్ని చట్టాలు చేసినా, ఎంత మంది అధికారులను నియమించినా,సాయుధ ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసినా, కాల్పు లు జరుపుతున్నా పదులసంఖ్యలో మరణాలు సంభ విస్తున్నా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎర్రచందనం తరలిపోతూనే ఉన్నది. పట్టుబడిన స్మగ్లర్లపై కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు.జైళ్లకు పంపుతున్నారు. చివరకు కాల్పులకు కూడా వెనుకాడటం లేదు.

గతంలో పదుల సంఖ్యలో స్మగ్లర్లు మరణించారు. అయినా ఈ స్మగ్లింగ్‌ను ఇవేమీ ఆపలేకపోతున్నాయి. ప్రాణాలకు తెగించి సిబ్బంది కూడా రాత్రింబవళ్లు శక్తిమేరకు కృషి చేస్తూనే ఉన్నారు. అప్పు డప్పుడు తాత్కాలికంగా అది ఆగినట్టు కన్పించినా ఏదో ఒక దారిలో కళ్లుగప్పి తరలిపోతూనే ఉంది. ఇటీవల దాడుల్లో బయటపడిన ఎర్రచందనం దుంగలు పట్టు బడుతున్న స్మగ్లర్లు ఈ విషయం చెప్పకనే చెబుతు న్నాయి. చివరకు స్మగ్లర్ల వద్ద నుండి తుపాకుల్లాంటి మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు.
తరలిపోతున్న ఎర్రచందనంలో పట్టుబడుతున్నది పది శాతం కూడా లేదనే విషయం అటవీశాఖ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. మరొక విస్మయం కలిగించే విషయం పాత్రధారులు మాత్రమే పట్టుబడుతున్నారు. దీని వెనుక ఉన్న బడా నేతలు సూత్రధారుల జోలికి పాలకులు వెళ్లలేకపోతున్నారు. కారణాలు ఏమైనా, కారకులు ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణాను ఆపలేకపోతున్నారు.
గత రెండుమూడు దశాబ్దాలుగా ఈ వృక్షసంపద తరలిపోతూనే ఉంది. అయితే కూలికోసం వచ్చి ఎర్రచందనం చెట్లను కూలగొడుతున్న తమిళనాడు కు చెందిన కూలీలు పట్టుబడుతున్నారే తప్ప వారి వెనుక ఉన్న పెద్దల హస్తం ఇప్పటికీ బయటకు తీయలేకపోతు న్నారు. ఆ ప్రాంతాల్లో ఎవరిని అడిగినా ఈ ఎర్రచంద నం స్మగ్లింగ్ వెనుక పాత్ర ఎవరెవరికి ఉందో కథలు కథలుగా చెప్తున్నారు. అయినా ఇప్పుడే కాదు గతంలో కూడా ఎప్పుడూ పాలక పెద్దలు ఆవైపు దృష్టిసారించ కుండా, మూలాల్లోకి వెళ్లకుండా ఈ అక్రమ స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు ప్రయత్నాలు చేయడం ప్రయోజనం లేకుండాపోతున్నది.
ఆంధ్రప్రదేశ్, కడప, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే ఈ ఎర్రచందనం వృక్షాలు విస్తరించి ఉన్నాయి. వీటిని 1973లో అరుదైన వృక్షజాతుల జాబితాలో సైడ్స్(కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేష నల్ ట్రేడ్ ఇన్ ఎన్ డేంజర్డ్ స్పైసీస్)లోకి చేర్చారు. దీనివల్ల ఎర్రచందనం దుంగల ఎగుమతిపై నిషేధం అమలులోకి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో పరిమితంగా ఉన్న ఈ వృక్షాలను సంరక్షించుకునేందుకు వెసులుబాటు కల్పించారు. వాస్తవంగా చూస్తే ఈ ఎర్రచందనానికి భారతదేశంలో పెద్ద గిరాకీ లేదు. మార్కెట్ కూడా లేదని చెప్పొచ్చు.
కానీ చైనా, జపాన్ దేశాల్లో ఊహించని రీతిలో డిమాండ్ ఉంది. అది అంతకంతకు పెరుగుతుండడం కోట్లాది రూపాయల ఆదాయం వస్తుండ డంతో ఎర్రచందం దుంగలను స్మగ్లర్లు అక్రమంగా విదేశా లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.సముద్ర మార్గా ల ద్వారా దేశసరిహద్దులు దాటించేందుకు ఎప్పటికప్పుడు కొత్తకొత్త వ్యూహాలను అనుసరిస్తున్నారు. కొన్నిప్రాంతాల్లో అయితే వ్యవసాయోత్పత్తుల పేరుతో బోగస్ అనుమతుల ను కూడా పొందుతున్నారు.చెన్నై,ముంబాయి, కోచి తది తర రేవ్ఞల నుంచి సరుకురవాణా ఓడల ద్వారా తరలిపోతున్నది.
రోడ్డు మార్గాలను కూడా వదిలి పెట్టడంలేదు. ఢిల్లీ,ఛండీగడ్ గోదాముల్లో దాచిన సరుకును ఒకవ్యూహం ప్రకారం నేపాల్‌కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి చైనాకు తరలిపోతున్నది.మరొకపక్క మణిపూర్, మిజోరం నుంచి కూడా ఈ అక్రమ రవాణా యధేచ్ఛగా జరుగుతున్నట్లు అధికార వర్గాలు అంగీకరిస్తున్నారు. ఈ చెట్లు శేషాచలం, వెలుగొండ అడవ్ఞల్లో మాత్రమే పెరగడానికి కారణాలు ఏమిటో ఇప్పటికీ మన శాస్త్రజ్ఞులు కనుక్కోలేకపోతున్నా రు.కొన్నివందల సంవత్సరాలుగా వృక్షశాస్త్రవేత్తలు పరిశో ధనలు జరుపుతున్నా తెలియడం లేదు.
1700 సంవత్స రంలో బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఎర్రచందనం చెట్లనుదేశంలోని పలు ప్రాంతాలతో పాటు తమ దేశానికి కూడా తీసుకు వెళ్లి పరీక్షలు జరిపి పెంచేప్రయత్నం చేశారు. అక్కడ కూడా సత్ఫలితాలు ఇవ్వలేదు.చెట్లు పెరగడంలేదు. పెరి గినా అందులోకావాల్సిన నాణ్యత లభించలేదు.ఈ చెట్లకు ఇంత విలువ ఎందుకు వస్తున్నది? ఎందుకు ఉపయోగి స్తున్నారన్న విషయంలో కూడా ఇప్పటికీ స్పష్టత లేదు. సంగీత పరికరాలకు, ఆటంబాంబుల తయారీలో వీటిని ఉపయోగిస్తున్నారనే ప్రచారంజరిగినా ఆ తర్వాత తప్పు అని తేలిపోయింది.
ఇప్పుడు అణుఇంధనంతయారీలోనూ, శృంగార సామర్థ్యంపెంచే మందుల్లోనూ దీనిని వాడుతు న్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.జపాన్ కానీ, చైనాకానీ వీటినితాము ఎందుకు కొంటున్నట్లు? ఎందుకు ఉపయోగిస్తున్నామని కానీ బయటపడకుండా అన్ని జాగ్ర త్తలు తీసుకుంటున్నారు.అంతర్జాతీయ బయోడైవర్సిటీ సంస్థ అధ్యయనం అంచనాప్రకారం ఒక టన్ను ఎర్రచంద నానికి ఏడెనిమిది కోట్లకుపైగా గిరాకీ ఉంటుందని అంటు న్నారు.అందుకే రాయలసీమలోని మాఫియా ముఠాలు కొందరు ఫ్యాక్షన్నేతలు,ఇంకొందరు రాజకీయనేతలు ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను తమ వ్యాపకంగా మార్చుకున్నారు.
దీనికితోడు అటవీశాఖ సిబ్బంది, అధికారుల్లో కొందరు స్మగ్లర్లతో కుమ్మక్కవ్ఞతున్నారు.చట్టాల్లోని లొసుగులుకూడా స్మగ్లర్ల పాలిట వరాలుగా మారుతున్నాయి. ఇక ప్రత్యేకం గా ఈ ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించేందుకే ఏర్పాటుచేసిన టాక్స్ఫోర్సు విభాగం రకరకాల సమస్యల తో కుదేలవ్ఞతున్నది.నిజాయితీపరులైన అధికారులు నిరు త్సాహంతో నీరసించిపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు ఈ వృక్షసంపదను సంరక్షించేందుకు త్రికరణశుద్ధిగా కృషి చేయకపోతే అంతరించిపోయే ప్రమాదముంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/