రాష్ట్రంలో మరో 1,410 కొత్త కేసులు నమోదు

జీహెచ్ఎంసీ పరిధిలో 918 కేసులు

రాష్ట్రంలో మరో 1,410 కొత్త కేసులు నమోదు
corona virus-telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 1,410 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 30 వేల మార్కును దాటేసి 30,946గా నమోదు కాగా, ఇదే సమయంలో నిన్న ఒక్కరోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 331కి పెరిగింది. నిన్న 913 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కావడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 12,423కి తగ్గింది. కరోనా బారినపడి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 18,192కు పెరిగింది. నిన్న నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం 918 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో రంగారెడ్డి (125), సంగారెడ్డి (79), మేడ్చల్ (67), వరంగల్ అర్బన్ (34), కరీంనగర్ (32), భద్రాద్రి కొత్తగూడెం (23), నల్గొండ (21), నిజామాబాద్ (18) మెదక్ (17), ఖమ్మం (12) సూర్యాపేట (10) ఉన్నాయి. ఇక, పెద్దపల్లి, ఆదిలాబాద్, వికారాబాద్, జనగామ, ములుగు, వనపర్తి, సిద్ధిపేటలలో ఒక్కో కేసు నమోదైంది.

రాష్ట్రంలో మరో 1,410 కొత్త కేసులు నమోదు

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/