పవన్ ఇంటికి చంద్రబాబు

హైదరాబాద్ లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు వెళ్లారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమ్మలో ఇరు నేతలు పలుమార్లు పొత్తులు , సీట్ల గురించి చర్చలు జరిపారు. తాజాగా చంద్రబాబు..స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి పొత్తుల గురించి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.

తొలిసారిగా చంద్రబాబు వెళ్లడం తో పవన్ సాదరంగా చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నారా లోకేశ్ యువగళం ముగింపు సభకు చంద్రబాబుతో పాటు పవన్ కూడా వస్తారని ప్రచారం జరిగినా… ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా సిద్ధం కాకపోవడంతో పవన్ కల్యాణ్ రావడంలేదని ప్రకటన వెలువడింది. ఈ అంశం కూడా చంద్రబాబు, పవన్ ల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.