‘పుష్ప’ సినిమాను మ్యారేజ్ రిసెప్షన్ తో పోల్చిన సునీల్ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్​గా చేసింది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సమంత ప్రత్యేక గీతం చేసింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో ఆదివారం హైదరాబాద్ యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధి గా రాజమౌళి హాజరై ఫంక్షన్ కు మరింత కళ తీసుకొచ్చారు.

ఈ వేడుకలో సునీల్ మాట్లాడుతూ..‘నేను అల వైకుంఠపురములో’ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ఇది పెళ్ళిభోజనం లాంటి సినిమా అవుతుందని చెప్పాను. అలాగే జరిగింది. ఇప్పుడు ‘పుష్ప’ సినిమా విషయంలో కూడా చెబుతున్నాను. ఇది పెళ్ళి తర్వాత జరిగే రిసెప్షన్ లాంటిది. అందులో కక్కా ముక్కా దొరుకుతాయి. ఎవరు ఎంతతినాలో అంత తినేయొచ్చు. అలా ఉంటుంది ఈ సినిమా. తెలుగులో చాలా మంది డైరెక్ట్ గా విలన్స్ అయిపోతున్నారు. నేను మాత్రం ఓ పది సినిమాల్లో హీరోగా చేసి, సిక్స్ ప్యాక్ చేసి ఆ తర్వాత విలన్ గా వస్తున్నాను. అభిమానులకు ముందే చెబుతున్నాను. ఈ సినిమాలో నేను నవ్వించను. కొంచెం భయపెడతాను అంటూ చెప్పుకొచ్చారు.