గండికోటలో కమల్ హాసన్ సందడి

లోక నాయకుడు కమల్ హాసన్ కడప జిల్లా గండికోటలో సందడి చేసారు. ప్రస్తుతం కమల్ ..శంకర్ డైరెక్షన్లో ఇండియన్ 2 మూవీ చేస్తున్నాడు. ఈ చిత్ర తాజా షెడ్యూల్ గండికోటలో ప్లాన్ చేసారు. ఓ వారం రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరగనుంది. ఈ క్రమంలో కమల్ కర్నూల్ కు చేరుకున్నారు. ఇక కమల్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.దీంతో షూటింగ్ స్పాట్ వద్ద సందడి వాతావరణం కనిపించింది. తనకోసం వచ్చిన ప్రజలకు కమల్ అభివాదం చేశారు.

1996 లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కుతుంది. భారతీయుడు చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికి ఈ సినిమా బుల్లితెర ఫై ప్రసారమవుతూ..అలరిస్తుంటుంది. ఇక ఇండియన్ 2 మూవీ ఎప్పుడో షూటింగ్ మొదలైంది..కాకపోతే చిత్ర సెట్ లో ప్రమాదం జరగడం పలువురు మృతి చెందడం , ఆ తర్వాత బడ్జెట్ ఎక్కువ కావడం తో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.రీసెంట్ గా మళ్లీ షూటింగ్ మొదలైంది.