జేఎన్‌యూ ఘటనపై హెచ్‌సియూలో నిరసనలు

Students protest at Hyderabad Central University
Students protest at Hyderabad Central University

హైదరాబాద్‌: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగారు. అర్థరాత్రి క్యాంపస్‌లో విద్యార్థులంతా కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జేఎన్‌యూ విద్యారును హెచ్‌సియూ విద్యార్థులు పిలుపునిచ్చారు. మరోవైపు వామపక్షాలు కూడా ట్యాంక్‌బండ్‌ దగ్గర గల లిబర్టీ వద్ద జేఎన్‌యూ విద్యార్థులపై జరిగిన దాడి ఘటనపై నిరసనకు దిగారు. ఆదివారం రాత్రి జేఎన్‌యూలోకి కొందరు దుండగులు చొరబడి హింసకు పాల్పడ్డారు. ముసుగులు ధరించి కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. విద్యార్థుపై, ప్రొఫెసర్లపై దాడికి దిగారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిచారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/