ఓ ఇంటివాడైన ‘దసరా’ డైరెక్టర్

దసరా ఫేమ్ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల ఓ ఇంటివాడయ్యాడు. నాని – కీర్తి సురేష్ హీరో , హీరోయిన్లు గా నటించిన దసరా మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. ఈ మూవీ తో డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన శ్రీకాంత్..మొదటి మూవీ తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఈయన తో సినిమాలు చేసేందుకు హీరోలు , నిర్మాతలు పోటీపడుతున్నారు.

తాజాగా శ్రీకాంత్‌ ఓదెల బ్యాచ్‌లర్‌ లైఫ్‌కు గుడ్‌ బై చెప్పి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. కరీంనగర్ లో శ్రీకాంత్ వివాహం జరుగగా..చిత్ర సీమ నుండి దర్శకుడు సుకుమార్‌, నాని ఫ్యామిలీ, జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్‌ కేవీతోపాటు పలువురు సెలబ్రిటీలు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే నాని పెళ్లి కి హాజరుకాలేకపోయాడు. పూణేలో ఓ యాడ్‌ ఫిల్మ్‌ షూటింగ్ కారణంగా వెడ్డింగ్‌కు రాలేకపోయాడని సమాచారం. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న శ్రీకాంత్‌ ఓదెలకు శుభాకాంక్షలు తెలియజేశాడు నాని.