సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ టాక్

బుల్లితెర ఫై సందడి చేసే సుడిగాలి సుధీర్..ఇప్పుడు గాలోడు అంటూ వెండితెర ఫై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీని సంస్కృతి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. భీమ్స్ దీనికి సంగీతం అందించగా , గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. సప్తగిరి, శకలక శంకర్, పృథ్వీ, సత్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మంచి అంచనాల మధ్య ఈరోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన సినీ లవర్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.

ఈ మూవీ ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉందని , ఇందులో సుడిగాలి సుధీర్ అల్లరి పనులు చేస్తూ తిరిగే గాలోడుగా కనిపించాడని అంటున్నారు. అలాంటి ఓ కుర్రాడు అమ్మాయి ప్రేమలో పడడం.. ఆ తర్వాత విలన్స్ ఎంట్రీతో జైలుకు వెళ్లడం.. వంటి అంశాలతో ఇది తెరకెక్కిందని, కథ పాతదే అని , కాకపోతే కాస్త కొత్తగా చూపించారని అంటున్నారు. ఇక సుడిగాలి సుధీర్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్, కామెడీ ఈ సినిమాకు ప్లస్ అని చెపుతున్నారు. అలాగే, దర్శకుడు ఎంచుకున్న కథ కొత్తగా లేకపోవడంతో పాటు నెమ్మదించిన స్క్రీన్‌ప్లే, లీడ్ పెయిర్ మధ్య లవ్ ట్రాక్, లాజిక్ లేని సన్నివేశాలు ఈ చిత్రానికి మైనస్‌గా ఉన్నాయని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా యావరేజ్ అని చెపుతున్నారు.