నవంబర్ 24 నుంచి అమెజాన్ లో కాంతార స్ట్రీమింగ్

కాంతార మూవీ కోసం ఓటిటి ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక వారి ఎదురుచూపులకు తెరపడే సమయం వచ్చింది. నవంబర్ 24 నుండి కాంతారా మూవీ అమెజాన్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

కన్నడలో సెప్టెంబరు 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బాస్టర్ హిట్‌ని అందుకున్న ఈ మూవీ మిగిలిన భాషల్లో కూడా అక్టోబరు 15న రిలీజ్ చేశారు. అయితే.. ఊహించని విధంగా విడుదలైన అన్ని భాషల్లోనూ కాంతార రికార్డుల మోత మోగించేస్తూ ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఒక్క తెలుగులోనే ఈ మూవీ దాదాపు రూ.50 కోట్ల వరకు కలెక్ట్ చేసిందంటే అర్ధం చేసుకోవచ్చు. కేవలం సినీ లవర్స్ మాత్రమే కాదు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సైతం ఈ సినిమాను చూసేందుకు పోటీ పడ్డారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా లో వ్యక్తం చేసి సినిమా కు బూస్ట్ ఇచ్చారు.

మరోపక్క తెలుగులో కాంతార సినిమా నాన్ థియేట్రికల్ హక్కుల్ని కొనుగోలు చేసినందుకు ప్రముఖ ఛానల్స్ భారీగానే పోటీ పడ్డాయి. ఫైనల్’గా స్టార్ మా ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని సొంతం చేసుకుంది. మొత్తం 4.5 కోట్ల రూపాయలకు స్టార్ మా కాంతార శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుంది.