‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ రిలీజ్

విశ్వక్ సేన్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘దాస్ కా ధమ్కీ’. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో మార్చి 22 న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్. ఈ ట్రైలర్ బట్టి చూస్తే విశ్వక్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు అర్ధం అవుతుంది.

సంజయ్ రుద్ర అనే ఒక డ్రగ్గిస్ట్ క్యాన్సర్ కు మందు కనుగొంటారు. అయితే అతని నుంచి ఆ డ్రగ్ ఫార్ములా దక్కించుకోవాలని డ్రగ్స్ కంపెనీలు వెనుక పడడం ఆ తర్వాత ఆయన మిస్ అవడం ఆసక్తికరంగా మారాయి. ఇక ఆ తర్వాత అతని ప్లేస్ లోకి మరొకరిని రంగంలోకి దించడం ఆ తర్వాత ఫ్యామిలీతో వచ్చే సన్నివేశాలు, మధ్యలో లవ్ ట్రాక్ అన్ని కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్ల పై కరాటే రాజు ఈ ధమ్కీని నిర్మించారు. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించిన ధమ్కికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. లియోన్ జేమ్స్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

YouTube video