ఆత్మహత్య చేసుకున్న నటుడు సుధీర్ పోస్టుమార్టం రిపోర్ట్

చిత్రసీమ లోని మరో యువ నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుందనపు బొమ్మ ఫేమ్ సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడు. సుధాకర్ కోమాకుల, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన కుందనపు బొమ్మ అనే సినిమాలో సుధీర్ కీలక పాత్ర పోషించి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తో పాటు పలు వెబ్ సిరీస్ లలోను సుధీర్ నటించి అలరించాడు. ఇక సుధీర్ కెరియర్ కు డోకా లేదని అంత అనుకుంటున్నా సమయంలో అతడు వైజాగ్‌లో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

కాగా సుధీర్ వర్మ కు సంబదించిన పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం… ఆయన విషం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. సుధీర్ వర్మ గురించి ఆయన స్నేహితుడు ఒకరు మాట్లాడుతూ… వర్మ చాలా మంచి వ్యక్తి అని, చాలా సున్నిత మనస్కుడని చెప్పారు. వర్మ తండ్రి ఏ1 కాంట్రాక్టర్ గా ఉండేవారని, తండ్రి మరణం తర్వాత వర్మ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపారు. ఇక సుధీర్ అంత్యక్రియలు వైజాగ్ లోని స్మశాన వాటికలో జరిపారు.