ఎర్రబెల్లి ఫై ఇంత అభిమానమా..?

మాములుగా సినీ స్టార్స్ కు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారనే సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరో పుట్టిన రోజు అంటే వారి పుట్టిన రోజు కంటే ఎక్కువగా ఫీల్ అవుతారు. ఉదయాన్నే గుడికి వెళ్లి ఇష్టమైన హీరో ఫై అర్చన చేయించడం..పలు స్వీట్స్ పంచడం , రక్తదానం చేయడం , మొక్కలు నాటడం చేస్తూ..వారి అభిమానాన్ని చాటుకుంటారు. కానీ ఇక్కడ మంత్రి ఎర్రబెల్లి ఫై ఓ అభిమాని తన అభిమానాన్ని చాటుకున్నాడు.

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు జన్మదినం సందర్భంగా.. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఆయన శిష్యుడు, కేయూ జేఏసీ వైస్ చైర్మన్, భారత రాష్ట్ర సమితి యువజన నాయకుడు మేడారపు సుధాకర్‌ సరికొత్త పంథాలో తన గురువుపై అభిమానాన్ని చాటుకున్నారు. తన రక్తంతో గీయించిన చిత్రపటాన్ని ఎర్రబెల్లికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. రాజకీయ గురువు అయిన ఎర్రబెల్లి దయాకర్‌ రావు పుట్టినరోజు తన పండుగ రోజు అని పేర్కొన్నాడు. అందుకే బ్లడ్‌ ఆర్ట్‌ వేయించానని చెప్పుకొచ్చాడు. మేడారపు సుధాకర్‌ ఆ బ్లడ్‌ ఆర్ట్‌ను బహూకరించగా ఎర్రబెల్లి మురిసిపోయారు. తనకు పుట్టినరోజు సందర్భంగా మరిచిపోలేని బహుమతి ఇచ్చావని అభినందించారు.