ట్రస్ట్‌లోని పిల్లలందరూ కరోనా నుండి కోలుకున్నారు

కోలుకుని అందరూ ట్రస్టుకు చేరుకున్నారన్న లారెన్స్

My-kids-are-safely-recovered-from-Coronavirus-Says-Raghava

చెన్నై: ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్‌ నిర్వహిస్తున్న ట్రస్ట్‌లో 18 చిన్నారులకు, ముగ్గురు సిబ్బందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తన ట్రస్టులోని చిన్నారులందరూ కోలుకున్నట్టు లారెన్స్ తెలిపారు. కరోనా నుండి కోలుకున్న వారందరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ట్రస్టుకు చేరుకున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాత్రనక, పగలనక కష్టపడుతున్న వైద్యులు, నర్సులకు లారెన్స్ ధన్యవాదాలు తెలిపారు. పిల్లలు కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు లారెన్స్ ట్వీట్ చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: