మరోసారి అమెరికాలో కలకలం..నలుగురు మృతి

Four people killed in Philadelphia shooting and suspect in custody, police say

ఫిలడెల్ఫియా: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం చెలరేగింది. ఫిలడెల్ఫియాలోని కింగ్‌సెసింగ్‌ పొరుగున ఉన్న వారింగ్టన్‌ అవెన్యూలోగల 5700 బ్లాక్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో గాయపడిన వారిని పెన్ ప్రెస్బిటేరియన్లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతున్నది. కాగా, కాల్పులు జరిగిన కొద్దిసేపటికే ఫ్రేజియర్ స్ట్రీట్ 1800 బ్లాక్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుడు బుల్లెట్ ప్రూఫ్ చొక్కా ధరించి ఉన్నాడని, అతని దగ్గర రైఫిల్, తుపాకీ ఉన్నాయని తెలిపారు. కాగా, కాల్పులు జరిగిన వీధిని మంగళవారం తాత్కాలికంగా బ్లాక్‌ చేసినట్లు చెప్పారు.