అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడు

ysrcp-declares-madugula-mutyala-naidu-as-anakapalli-mp-candidate

అమరావతిః అనకాపల్లి లోక్ సభ స్థానానికి అభ్యర్థిని వైఎస్‌ఆర్‌సిపి ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలోకి దించింది. ఇప్పటి వరకు వైఎస్‌ఆర్‌సిపి 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలను ప్రకటించింది. అనకాపల్లి ఎంపీ సీటును మాత్రమే పెండింగ్ లో ఉంచింది. ఇప్పుడు ఈ స్థానంలో ముత్యాలనాయుడిని నిలబెట్టారు. ముత్యాలనాయుడు ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను ఇప్పుడు అనకాపల్లి ఎంపీ స్థానానికి మార్చారు. మాడుగుల ఎమ్మెల్యే టికెట్ ను ఈర్లి అనురాధకు ఇచ్చారు. ముత్యాలనాయుడు కూతురే అనురాధ. బూడి ముత్యాలనాయుడు కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందినవారు.