జూన్ నుంచి ప్ర‌జాక్షేత్రంలో నారా లోకేష్

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటి నుండే పూర్తిస్థాయిలో ప్ర‌జాక్షేత్రంలోకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ జూన్ నుండి ప్ర‌జాక్షేత్రంలో వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బాదుడే బాదుడు అంటూ వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇదే సమయంలో వచ్చే నేలనుండి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు.

గతంలో పోటీ చేసి ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్న లోకేష్ తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నారు. ఈ నెల 27, 28 తేదీలలో ఒంగోలులో టిడిపి మహానాడు నిర్వహించనుంది. దాదాపు లక్షమందికి పైగా పార్టీ శ్రేణులు హాజరయ్యే విధంగా చంద్రబాబు ప్లాన్ చేశారు. మహానాడు తర్వాత రానున్న ఎన్నికలను సవాల్ గా తీసుకున్న లోకేష్ ప్రజాక్షేత్రంలో ఉండటంకోసం ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. జూన్ నెలలో లోకేష్ పర్యటనలు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం.