ఐపిఎల్‌ ఇక టీవీల్లోనే.. ప్రేక్షకులకు నో ఎంట్రీ!

IPL 2020
IPL 2020

ముంబయి: ఐపిఎల్‌ 2020పై నిర్వహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో రోజు రోజుకు కరోనా వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఐపిఎల్‌ పదమూడో సీజన్ నిర్వహణపై అనుమానాలు తలెత్తాయి. మహారాష్ట్రలో ఐపీఎల్‌ టికెట్లను విక్రయించకూడదని ఆ రాష్ట్ర సర్కారు ఆదేశించగా.. కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ లీగ్‌ వద్దంటోంది. దేశ, విదేశీ ఆటగాళ్లు, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని
బిసిసిఐ, ఐపిఎల్‌ గవర్నింగ్ కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఈ సీజన్‌ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించకూడదని భావిస్తున్నారు. ఈ విషయాన్ని బిసిసిఐకి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఐపిఎల్‌ మాత్రం కచ్చితంగా జరుతుందని స్పష్టం చేశారు. మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి కాబట్టి.. అభిమానులు టీవీల్లో ఆట చూడొచ్చని తెలిపారు. ఈ లెక్కన ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ఐపిఎల్‌ గవర్నింగ్ కౌన్సిల్, బీసీసీఐ శనివారం సమావేశమై తుది నిర్ణయం వెల్లడించే చాన్సుంది. కాగా ఈ నెల 29 నుంచి ఐపిఎల్‌ పదమూడో సీజన్‌ మొదలవనుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/