హైదరాబాద్ లో వీధి కుక్క స్వైర విహారం

మరోసారి హైదరాబాద్ లో హైదరాబాద్ లో వీధి కుక్క స్వైర విహారం చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 16 మందిని కరిచింది. రాష్ట్రంలో వీధి కుక్కల దాడికి ఎంతోమంది హాస్పటల్ పాలవుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో నాల్గుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం వీధి కుక్కల విషయంలో పలు ఆదేశాలు జారీచేసింది. ఈ ఘటన మరవక ముందే తాజాగా బాలానగర్ లో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

బాలానగర్ పరిధిలోని వినాయక నగర్ లో ఓ వీధి కుక్క.. పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించింది. 16 మందిపై దాడి చేసింది. శనివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై ఎగబడి కరిచింది. గాయపడిన వారిలో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. క్షతగాత్రుల్లో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు కూకట్ పల్లి జోన్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది.. అక్కడికి చేరుకుని దాదాపు 2 గంటలపాటు శ్రమించి కుక్కను పట్టుకున్నారు.