స్కూళ్ల ప్రారంభంపై వింత వైఖరి

ఉపాధ్యాయవర్గాల్లో గందరగోళం

School children
School children

కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్నవేళ ఈ విద్యాసంవత్సరానికిగాను పాఠశాలలను ఎలా నిర్వహించాలోనన్న విషయమై పలువ్ఞరు మేధావులు తలలు బాదుకుంటున్నారు.

ఈ సందర్భంగా అనేక సూచనలను, సలహాలను ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పలు వార్షిక పరీక్షలను అన్ని స్థాయిల్లో రద్దుచేసుకుంటున్నారు.

జెఇఇ మెయిన్స్‌, అడ్వాన్స్‌, నీట్‌ లాంటి పరీక్షలనే ఈ విద్యాసంవత్సరానికిగాను రద్దుచేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన ప్రభుత్వ వర్గాలు చేస్తున్నాయి.

ఈ విషయాలేమీ సంబంధిత పాఠశాల విద్యాశాఖ అధికారులకు పట్టవా! కేవలం ఉపాధ్యాయులు ఖాళీగా ఉండి వేతనాలు తీసుకుంటున్నారనే నెపంతోనే ఇలాంటి ఉత్తర్వులను విడుదల చేస్తున్నారా! అనేది ఉపాధ్యాయవర్గాల్లో వినిపిస్తోంది.

దే శవ్యాప్తంగా కరోనా వ్యాధి విలయతాండవం చేస్తున్న వేళ, కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి రమేష్‌ సోఖ్రియాల్‌ ఇటీవల మాట్లాడుతూ ఆగస్టు 15 వరకు పాఠశాలలు తెరిచే పరిస్థితి లేదన్నారు.

అంతవరకూ విద్యార్థులకు వివిధ ఆన్‌ లైన్‌ సేవల ద్వారా ఆన్‌లైన్‌ బోధన పొందుటకుగాను తగు ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొనడం విశేషం.

‘గాలివాన వస్తే కథే మారిపోతుంది అన్నట్లు యావత్తు ప్రపంచమే కొవిడ్‌-19తో అల్లకల్లోలమవుతుంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రం విద్యార్థులు లేకుండా పాఠశాలలు తెరవడానికి విద్యాశాఖ ఉత్తర్వులివ్వడం విడ్డూరమే మరి.

దీనిలో భాగంగా ఆకస్మికంగా పాఠశాల విద్యాశాఖ అధికారులు జూన్‌ 22న జీవో నెంబర్‌ 145ను విడుదల చేశారు.

ప్రతి ఏడాది సెప్టెంబర్‌ చివరి నాటికి పాఠశాలలకు సంబంధించిన మౌలిక విషయాలను పొందుపరుస్తూ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు యు- డైస్‌లో అప్లోడ్‌ చేస్తారు.

గత విద్యాసంవత్సరానికిగాను డిసెంబర్‌ నాటికి యు-డైస్‌లో వివరాలు అప్లోడ్‌ చేయడమైనది.

ఈ యు- డైస్‌ అసమగ్రంగా ఉందని, అందులోని 11 అంశాలు ఖాళీగా ఉన్నాయని, దాని కోసం ఉపాధ్యాయులు అందరూ పాఠశాలకు విధిగా హాజరై తక్షణమే నింపాల్సినదిగా జీవోలో స్పష్టంగా పేర్కొ న్నారు.

జీవో విడుదల కావడం మధ్యాహ్నం అయితే, అదే రోజు ఉపాధ్యాయులను పాఠశాలకు వెళ్లమనడం విడ్డూరం మరి. ఈ క్రమంలో నేడు ఉపాధ్యాయులు వారి వారి పాఠశాలలకు వెళ్లి చెట్ల కింద గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చాలా మంది సరైన రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డారు కూడా. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆగస్టు మూడు నుంచి పాఠశాలలు తెరుస్తామని పదే పదే చెప్పడం విశేషం. ఆయన మాటలకు భిన్నంగా పాఠశాలలు తక్షణమే తెరవాల్సిందిగా సంబంధిత అధి కారులు ఆదేశాలు ఇవ్వడం ఆశ్చర్యకరమే.

దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాధి విజృంభణ అంతకంతకూ పెరుగుతున్న మాట వాస్తవం. ప్రభుత్వం దీనిని దృష్టిలో ఉంచుకొని గత మార్చి నెలలో బయోమెట్రిక్‌ హాజరు నుండి ఉపాధ్యాయులకు మినహా యింపు ఇవ్వడం జరిగింది.

కానీ మొన్న విడుదలైన వింత ఉత్తర్వు లో విధిగా బయోమెట్రిక్‌ హాజరు వేయమనడం ఆందోళనకరమే. కరోనా తీవ్రత తగ్గేవరకు బయోమెట్రిక్‌ హాజరు నుంచి ఉద్యో గులు, ఉపాధ్యాయులను మినహాయించవలసిందిగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు ప్రతినిధ్యాలు చేశాయి.

ఇలాం టి పరిస్థితుల్లో బయోమెట్రిక్‌ వేయమనడం ఎంతవరకు ఒప్పొు బోధపడడం లేదు. అసలే చాలా పాఠశాలలు క్వారంటైన్‌ కేంద్రా లు, అబ్జర్వేషన్‌ సెంటర్స్‌గా ఉన్నాయి.

కొన్నింటిని ఖాళీ చేసిన ప్పటికీ వాటిలో బ్లీచింగ్‌ చల్లి, సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారి చేసి సరైన పరిశుభ్రత వాతావరణాన్ని ఇంకా స్థానిక అధి కారులు కల్పించలేదు.

ఇలాంటి వాతావరణంలో ఉన్న పాఠశాల లకు ఉపాధ్యాయులు వెళ్లి ఏం చేస్తారు?

విద్యార్థులు లేని పాఠశా లలకు అందరూ ఉపాధ్యాయులను హాజరు కావాల్సిందిగా ఆదేశిం చడంలో శాస్త్రీయత ఎంతవరకు ఉందో అర్థంకావడం లేదు. జీవో లో పేర్కొన్న విషయాలన్నింటిని వర్క్‌టు హోంలో నిర్వహించు కోవచ్చు.

లేదంటే ఒకరిద్దరు హాజరై రెండు మూడు రోజుల్లో పూర్తి చేయవచ్చు.సాధారణంగా చాలామటుకు పనులు ప్రధానో పాధ్యాయులు,నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ నిర్వహిస్తుంటారు.

అలాంటప్పు డు ఉపాధ్యాయులంతా పాఠశాలలకి వెళ్లాల్సిన అగత్యమే లేదు.

పాఠశాలల నిర్వహణ అనేది చాలా సున్నిత విషయం. విద్యార్థు లు, ఉపాధ్యాయుల విద్యాపరమైన అవినాభావ సంబంధంలో వారి వారి ఆరోగ్యం ముడిపడి ఉంటుంది.

సాధారణంగా పాఠశా లల్లో విద్యార్థులతో కూడిన జనసమ్మర్థత ఉంటుంది. కావ్ఞన కరోనా వైరస్‌ వ్యాప్తి చెంది కుటుంబాలకు కుటుంబాలనే చుట్టి ముట్టవచ్చు. అందుకే పలు ప్రభుత్వాలు ఆచరణలో అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి.

కానీ ఎ.పి విద్యాశాఖకు ఎందుకొచ్చిన తొందరో! అంతుబట్టడం లేదు. క్షేత్రస్థాయిలో ఎటువంటి జాగ్రత్తలు పాటించకపోతే కరోనా వైరస్‌ విజృంభించే పరిస్థితి నెలకొంటుంది.

మనిషి ప్రాణం కన్నా ఏదీ ముఖ్యం కాదు. అనివార్యంగా రాబోవు విద్యాసంవత్సరం నష్టపోయినా ఆశ్చర్యం లేదు.

కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న వేళ ఈ విద్యాసంవత్సరానికి గాను పాఠశాలలను ఎలా నిర్వ హించాలోనన్న విషయమై పలువురు మేధావులు తలలు బాదు కుంటున్నారు.

ఈ సందర్భంగా అనేక సూచనలను, సలహాలను ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతియేటా ప్రతిష్టాత్మ కంగా నిర్వహించే పలు వార్షిక పరీక్షలను అన్ని స్థాయిల్లో రద్దు చేసుకుంటున్నారు.

జెఇఇ మెయిన్స్‌, అడ్వాన్స్‌, నీట్‌ లాంటి పరీక్షలనే ఈ విద్యాసంవత్సరానికిగాను రద్దుచేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన ప్రభుత్వ వర్గాలు చేస్తున్నాయి.

ఈ విషయాలేమీ సంబంధిత పాఠశాల విద్యాశాఖ అధికారులకు పట్టవా! కేవలం ఉపాధ్యాయులు ఖాళీగా ఉండి వేతనాలు తీసుకుంటున్నారనే నెపంతోనే ఇలాంటి ఉత్తర్వులను విడుదల చేస్తున్నారా! అనేది ఉపాధ్యాయవర్గాల్లో వినిపిస్తోంది.

రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయుల పనితీరు ఏ ఒక్కరూ శంకించడానికి వీలు లేదు.

ఎందుకంటే గతంలో సమైకాంధ్ర సమయంలో పాఠశాల తరగతుల నిర్వహణ పూర్తిగా జరగలేదు.

ఆయా నష్టపోయిన తరగతులను ఎంతో శ్రమకోర్చి సెలవుదినాల్లో నిర్వహించి విద్యార్థులకు ఏ విధంగానూ నష్టం కలగకుండా చేసిన ఘనచరిత్ర రాష్ట్ర ఉపాధ్యాయులకు ఉండనే ఉంది.

సుమారు లక్షా 80వేల మంది ఉపాధ్యాయులను ఈ వింత జీవో ఇబ్బందులపాలు చేస్తున్నదనడంలో సందేహం లేదు.

ఉపాధ్యాయులను కరోనా ఉధృతికి కారకులుగా తయారు చేయడం ఎంతవరకు హేతుబద్ధతో అర్థమవ్వడం లేదు.

గతవారం ‘వారథి కార్యక్రమం నిర్వహించేందుకు ఉపాధ్యాయులు ప్రతి బుధ, శుక్రవారాల్లో పాఠశాలలకు వెళ్లవలసిందిగా విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. దీనిని రాష్ట్రంలో గల ఉపాధ్యాయ సంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి.

కరోనా సమయంలో ఇలాంటి ఆదేశాలివ్వడం కరెక్ట్‌ కాదని తమ నిరసన తెలియచేశారు.

దానికి స్పందించిన పాఠశాల విద్యాకమిషనర్‌ ఇది ఉపాధ్యాయులకు కంపల్సరీ కాదని, వారి ఐచ్చికం మేరకే వెళ్లి సేవలు అందించాల్సిందిగా తన వీడియో ప్రసంగంలో స్పష్టంగా పేర్కొన్నారు.

ఆ వీడియో ప్రసంగం వచ్చిన మూడు రోజులకే అందరూ ఉపా ధ్యాయులు విధిగా పాఠశాలకు హాజరు కావాలని జీవో నెంబర్‌ 145 ద్వారా ఆదేశాలివ్వడంలో అంతర్యం ఏమిటి? .

గత ఏప్రిల్‌, మే నెలల్లో డాక్టర్లు, పోలీసులు, అధికారులు కొవిడ్‌-19 డ్యూటీ లో తమతమప్రాణాలను పణంగా పెట్టి ఉధృతంగా పాల్గొనడం జరిగింది.

వారికి తమ సహాయసహకారాలు అందిస్తూ పలువురు ఉపాధ్యాయులు కొవిడ్‌-19 విధులు నిర్వహించారు కూడా.

చాలా మంది ఉపాధ్యాయులు సామాజిక బాధ్యతతో అనేక సామాజిక స్వచ్ఛంద సంస్థల పిలుపుతో కరోనా వ్యాధి పట్ల ప్రజల్లో అవగా హన కల్పించేందుకుగాను స్వచ్ఛందంగా కృషి చేయడం గమ నార్హం.

అలాగే పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న నాడు- నేడు పనుల్లో ప్రధానోపాధ్యాయులు, మరికొంత మంది ఉపాధ్యా యులు తలమునకలుగా ఉండనే ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతలుగా జరిగిన వెబినార్‌ ఆన్‌లైన్‌వృత్యంతర శిక్షణలో పలువ్ఞరు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.

అలాగే మే 8,9 తేదీల్లో ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లి విద్యార్థుల ‘షూ కొలతలను తీసుకొని ప్రభుత్వానికి సమర్పించారు.

ఉపాధ్యాయు లేమీ ఖాళీగా ఉండలేదనే దానికి పైఉదాహరణలు చాలు.

కనుక ఉపాధ్యాయ వర్గాల్లో ఉన్న ఈ గందరగోళానికి తెరదించుతూ ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకొని ఉపాధ్యాయులను ఈ గందరగోళం నుంచి గట్టెక్కించాలి.

  • జానకి

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/