వందే భారత్ రైళ్లపై ఆగని రాళ్ల దాడులు

కేంద్ర సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్ల ఫై వరుస రాళ్ల దాడులు కలవరపెడుతున్నాయి. ఓ చోట కాకపోతే మరో చోట ఆగంతకులు రాళ్ల దాడి చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు భయం తో వణికిపోతున్నారు. మొన్న ఖమ్మంలో దాడి జరుగగా…ఈరోజు శుక్రవారం మహబూబాబాద్‌ – గార్ల రైల్వేసేషన్ల మధ్య రాళ్ల దాడి జరిగింది.

సికింద్రాబాద్‌ – విశాఖ మధ్య నడుస్తున్న రైలు ఫై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో నాలుగో నంబర్‌ కోచ్‌లో అద్దాలు పగిలాయి. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఈ సమయంలో దాడి జరిగింది. కోచ్‌ అద్దాలు పగులగా.. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని రైల్వే అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వేపోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. ఇక ఇదే నెల 3న ఖమ్మం సమీపంలో వందేభారత్‌ రైలుపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులను గుర్తించామని, వారికి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.