మహేష్ ఫై ముద్దుల వర్షం కురిపించిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత ల పెళ్లి రోజు ఈరోజు. ఈ సందర్భాంగా అభిమానులు , సినీ ప్రముఖులు వారికీ బెస్ట్ విషెష్ ను అందజేస్తున్నారు. మహేష్ – నమ్రత లు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో ఎంతో హ్యాపీగా ఉన్నారు. మహేష్ వరుస సినిమాలతో బిజీ గా ఉంటె.. నమ్రత మహేష్ తాలూకా బిజినెస్ లు , ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూ ఉన్నారు. అలాగే నమ్రత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. మహేష్ తాలూకా పిక్స్ తో పాటు పిల్లల తాలూకా పిక్స్ , వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక ఈరోజు 18వ వివాహ వార్షికోత్సవం సందర్బంగా సోషల్ మీడియా లో నమ్రత ఓ పాత ఫోటో ను షేర్ చేసి అభిమానులను సంతోష పెట్టింది.చాలా సంవత్సరాల క్రితం ఫొటో అయ్యి ఉంటుంది ఇది. ఫోటో లో మహేష్ బాబు చాలా చిన్నగా గౌతమ్ మాదిరిగా కనిపిస్తున్నాడు. మహేష్ బాబు పై పడి ముద్దుల్లో నమ్రత ముంచెత్తుతోంది. ఈ ఫొటో ఇద్దరి మధ్య ఉన్న బాండిండ్ మరియు ప్రేమకు ప్రతి రూపం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఎల్లప్పుడు ఇలాగే సంతోషంగా మీ జంట ఉండాలంటూ అభిమానులు కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం వీరు స్పెయిన్ లో ఉన్నారు. పెళ్లి రోజు వేడుకలు అక్కడే జరుపుకుంటున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది.