తిరుపతిలో భారీ ర్యాలీ ప్రారంభం

Chandrababu
Chandrababu

తిరుపతి: తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ ప్రారంభమయింది. ఈ ర్యాలీలో టిడిపి అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన ఈ ర్యాలీ కోసం హైదరాబాద్‌ నుంచి రేణిగుంట వచ్చారు. అక్కడి నుంచి తిరుపతిలోని పూలే విగ్రహం వద్దకు చేరుకున్నారు. మరోవైపు పోలీసులు ఈ ర్యాలీకి షరతులతో కూడిన అనుమతిని ఇచ్చారు. కృష్ణాపురం స్టేషన్‌ వరకు మాత్రమే ర్యాలీ నిర్వహించాలని పోలీసులు తెలిపారు. అయితే నేతలు మాత్రం నాలుగు కాళ్ల మండపం వరకు చేపడతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతాయో అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంకా ఈ ర్యాలీలో చంద్రబాబు తోపాటు అమరావతి పరిరక్షణ సమితి నేతలు కూడా ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/