భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 371 పాయింట్లు నష్టపోయి 61,560 పాయింట్ల వద్ద, నిఫ్టీ 104 పాయింట్లు క్షీణించి 18,181 పాయింట్ల వద్ద ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి డాలర్ మారకంతో రూపాయి 13 పైసలు క్షీణించి రూ. 82.38 వద్ద కొనసాగుతుంది.