ఆర్ధిక మాంద్యంలోకి అడుగు పెట్టేశారు.

ప్రపంచ దేశాలు ఆర్దిక మాంద్యంలోకి.. ఐఎంఎఫ్‌

kristalina georgieva
kristalina georgieva

వాషింగ్‌టన్‌: కరోనా ధాటికి యావత్‌ ప్రపంచం మొత్తం ఆర్ధిక సంక్షోభంలోకి అడుగు పెట్టిందని, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అధికారికంగా వెల్లడించింది. కరోనా చేస్తున్న విలయతాండవానికి ప్రపంచం మొత్తం గడగడలాడుతుంది. దీని కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ వ్యవస్థ కుదేలైందని, మరికొద్ది రోజుల్లో దీని ప్రభావం భారీగా ఉండబోతుందని ఐఎంఎఫ్‌ ఎండి. క్రిస్టాలినా జార్జీవా తెలిపారు. 189 దేశాలకు చెందిన ఐఎంఎఫ్‌ ప్రతనిధులతో సమావేశానంతరం క్రిస్టాలినా మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమయంలో ప్రపంచ దేశాలన్ని కరోనాను కట్టడి చేయాలని..అందుకు నిధుల కొరత లేకుండా చూసుకోవాలని.. సూచించింది. అలా అయితేనే 2021 లో ఈ మాంద్యం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ ఆర్ధికమాంద్యం కారణంగా భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతారని, దివాళాలు ఎక్కువ అవుతాయని, క్రిస్టాలినా ఆందోళన వ్యక్తం చేశారు. వీలైనంత వరకు సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు కరోనా కట్టడికి కృషియచేయాలని సూచించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/