క్వారంటైన్​ సెంటర్​కు తరలింపు

హైదరాబాద్ నుండి చేరుకున్న ప్రయాణికులు

Quarantine Center

Annavaram: తూర్పు గోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం చెందిన హరిహర సదన్​లో ఏర్పాటు చేసిన క్వారంటైన్​ సెంటర్​కు శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల టైమ్ లో పలు ప్రాంతాలకు చెందిన 58 పురుషులు, 12 మంది మహిళలను చేర్చారు.

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద హైదరాబాద్ నుండి రకరకాల మార్గాల ద్వారా చేరుకున్న వీరిని 16 బైకులు, 10 కార్లు, రెండు ఆర్.టి.సి బస్ లద్వారా ఇరు జిల్లాల పోలీసుల బందోబస్తు నడుమ ఎస్కార్ట్ లతో తీసుకువచ్చినట్లు ప్రత్తిపాడు సిఐ ఏఎస్ రావు తెలిపారు.

ఉన్నతాధికారుల నుండి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు క్వారం టైన్ లో అన్నవరం ఎస్.ఐ.మురళీమోహన్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తామన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/