అదనంగా 50 లక్షల డోసులు అవసరం : స్టాలిన్‌

చెన్నై: ప్రతి వారం అదనంగా 50 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులు ఇవ్వాలని కేంద్రాన్ని తమిళనాడు ప్రభుత్వం కోరింది. అక్టోబరు చివరికల్లా అర్హులైన అందరికీ వ్యాక్సిన్‌ వేసేందుకు అదనంగా డోసులు అవసరమని తెలిపింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీకి సీఎం ఎంకే స్టాలిన్‌ లేఖ రాశారు. ఈ నెల 12, 19 తేదీల్లో నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్‌ శిబిరాలు విజయవంతం అయ్యాయని, ఆ శిబిరాల్లో 45 లక్షల డోసులు వేశామన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/