వాణిజ్య ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

Hon’ble CM of AP will be Participating in Azadi Ka Amrit Mahotsav Programme at Vijayawada LIVE

విజయవాడ: సీఎం జగన్ వాణిజ్య ఉత్సవం-2021 కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్‌ సందర్శించారు. స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం జగన్‌ ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాణిజ్య ఉత్సవ కార్యక్రమంలో మంత్రులు గౌతమ్‌రెడ్డి, పేర్ని నాని, కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల రెట్టింపు దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఏపీ నుంచి అత్యంత చౌకగా ఎగుమతుల లక్ష్యంగా ఈడీబీ ప్రణాళికలు చేస్తుంది. ప్రస్తుతం ఏపీ నుంచి 4 ఓడరేవుల ద్వారా ఎగుమతులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఏపీ నుంచి 16.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. 2030 నాటికి 33.7 బిలియన్‌ డాలర్ల ఎగుమతులే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/