త్వరపడండి..ఏపీ సర్కార్ వారి చేపలు

ఏపీలో రాష్ట్ర సర్కార్ ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురాగా..తాజాగా ఇప్పుడు ప్రభుత్వ చేపల దుకాణాన్ని ప్రారంభించి వార్తల్లో నిలిచింది. విశాఖపట్నంలోని పెదగంట్యాడ మండలంలో ప్రభుత్వ చేపల దుకాణాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ చేపల ఔట్ లెట్ ని ఏర్పాటు చేసినట్లుగా మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఈ దుకాణంలో మార్కెట్ లో కంటే తక్కువ ధరలకే చేపలు అందిస్తామని అంటున్నారు.

రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రయోగాత్మకంగా ఈ ఔట్ లెట్ ని ఏర్పాటు చేసినట్లుగా.. మన చేప మన ఆరోగ్యం కింద ఈ పధకానికి శ్రీకారం చుట్టినట్లుగా అధికారులు చెప్పుకొచ్చారు. ఈ ఔట్ లెట్ కి డిమాండ్ ని చూసి మిగిలిన చోట్ల కూడా విస్తరిస్తామని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి విశాఖలో ఏర్పాటు చేసిన సర్కార్ వారి చేపల ఔట్ లెట్ కి జనాల నుండి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.