పవన్ కళ్యాణ్ లక్ష్యం, సిద్ధాంతం లేని వ్యక్తి – పేర్ని నాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడిన..ఈ సమావేశం ఏర్పటు చేసిన దానిపై విమర్శలు చేసే మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి పవన్ కళ్యాణ్ ఫై విరుచుకపడ్డారు. లక్ష్యం, సిద్ధాంతం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. నెలలో రెండు రోజులు మాత్రమే ఏపీకి వచ్చే పవన్, నోటికి వచ్చింది మాట్లాడి తిరిగి విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోతాడని , పవన్ ఉపన్యాసాలన్నీ సినిమా డైలాగులేనని హేళన చేసారు పేర్ని నాని.

కాపుల కోసం పవన్ ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. అసలు, ఏ సిద్ధాంతాన్ని చూసి పవన్ కళ్యాణ్ కు ఓటేయాలని అడిగారు. పవన్ కు కులాలపై అసలు కొంచం కూడా అవగాహన లేదని , రాజకీయాల్లో ఆస్కార్ అవార్డు ఉంటే ప్రతి ఏటా పవన్ కల్యాణ్ కే ఇవ్వాలని వ్యక్తపరిచారు. లోపాయికారీ ఒప్పందాలకు తాను దూరం అని చెబుతున్న పవన్ ఓసారి గత చరిత్రను పరిశీలించాలని పేర్కొన్నారు. 2012 నుంచి పవన్ ఎవరెవరితో ఒప్పందాలు చేసుకున్నారు..? 2014లో చంద్రబాబుకు ఊడిగిం చేసింది ఎవరు? 2019 ఎన్నికల ముందు బీజేపీని తిట్టి, ఎన్నికల తర్వాత బీజేపీని కలిసింది ఎవరు.? అంటూ పేర్ని నాని వరుస ప్రశ్నలు వేశారు.

ఇప్పుడున్న ప్రభుత్వం మారాలన్న పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు, ఎవరి కోసం మారాలో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఏడాది తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ వచ్చారని వ్యంగ్యంగా విమర్శించారు. ప్రజల కోసం అన్ని త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ కు మళ్ళీ సినిమాలు ఏమిటని ప్రశ్నించారు. గత సంవత్సరం ప్రజలకు పవన్ ఏం మేలు చేశారో చెప్పాలన్నారు. చంద్రబాబు బాగుండాలనేదే పవన్ అంతిమ లక్ష్యం అన్నారు.