మహేష్ బాబు తో దసరా డైరెక్టర్..?

తొలి చిత్రంతోనే పాన్ ఇండియా హిట్ అందుకున్న ..యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేల కు సూపర్ స్టార్ మహేష్ బాబు ఛాన్స్ వచ్చినట్లు వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ రెండోసారి జంటగా నటించిన చిత్రం దసరా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరు నిర్మించిన ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదేల దర్శకత్వం వహించారు. తెలంగాణలోని ఓ గ్రామం వీర్లపల్లి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

శ్రీరామ నవమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. నాని యాక్టింగ్ , డైరెక్టర్ శ్రీకాంత్ డైరెక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. చూసినవారు మళ్లీ మళ్లీ చూసేందుకు సిద్ధమవుతున్నారు. నాని అభిమానులు, ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం దసరా చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తూ ప్రశంసిస్తున్నారు. ఒక డైరెక్టర్ కు ఒక హిట్టు పడిందంటే తర్వాత సినీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్న విషయం తెలిసిందే. అలా శ్రీకాంత్ ఓదెలకు సూపర్ స్టార్ మహేశ్ బాబును డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందని పలువురు అంటున్నారు.

దసరా టీమ్ ను ప్రశంసిస్తూ తాజాగా మహేశ్ బాబు ఒక ట్వీట్ చేశారు. దసరా సినిమా స్టన్నింగ్ గా ఉంది. “టీమ్ ను చూస్తేంటే గర్వంగా ఉంది” అని మహేశ్ బాబు రాసుకొచ్చారు. ఈ ట్వీట్ కు నాని స్పందించారు. “థ్యాంక్యూ మహేశ్ సార్. మంచి సినిమాలకు మీ వాయిస్ ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది. పోకిరి సినిమాకు మణిశర్మ సంగీతం ఎలా ఉంటుందో అచ్చం అలాగే” అని తెలిపాడు. మహేశ్ బాబు హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకులతో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తారని, అందుకోసమే శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేసేందుకే అలా ట్వీట్ చేశారని అంటున్నారు.