జగనన్న విద్యాదీవెన నగదు పంపిణీ

YouTube video
Hon’ble CM will be Disbursing Fee Reimbursement to the Students under “JAGANANNA VIDYA DEEVENA”

బాపట్లః సిఎం జగన్‌ నేడు బాపట్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జగనన్న విద్యాదీవెన మూడో త్రైమాసిక నగదు బదిలీని బటన్‌ నొక్కి పంపిణీ చేశారు. బాపట్ల ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని సీఎం జగన్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కాలేజ్‌ గ్రౌండ్‌ బహిరంగ సభా ప్రాంగణంలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమం జరుగుతోంది. సీఎం వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కోన రఘుపతి, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీ మేరకు బాపట్లను జిల్లాగా ప్రకటించినందుకు డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. నూతన జిల్లా బాపట్ల అభివృద్ధి చెందుతోందన్నారు. జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. బాపట్లలో మెడికల్‌ కాలేజీ, 500 పడకల ఆస్పత్రిని మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/