మ‌ళ్లీ తెరుచుకున్న శ్రీలంక అధ్యక్ష భవనం

Sri Lanka President’s office to reopen after crackdown

కొలంబోః నేడు శ్రీలంక అధ్యక్ష భ‌వనాన్ని మ‌ళ్లీ తెరిచారు. ఆర్థిక సంక్షోభం నేప‌థ్యంలో నిర‌స‌న‌కారులు ఆ భ‌వనాన్ని చుట్టుముట్టిన విష‌యం తెలిసిందే. ఆందోళ‌న‌కారులు అధ్య‌క్ష భ‌వ‌నాన్ని ముట్ట‌డించడానికి ముందు మాజీ అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స దేశం విడిచి వెళ్లారు. అయితే గ‌త శుక్ర‌వారం భారీ స్థాయిలో మిలిట‌రీ ఆ భ‌వ‌నాన్ని త‌మ ఆధీనంలోకి తీసుకున్న‌ది. ప్రెసిడెన్షియ‌ల్ సెక్ర‌టేరియేట్ వ‌ద్ద రెయిడ్ నిర్వ‌హించారు. గ‌ల్లే ఫేస్ నిర‌స‌న ప్ర‌దేశంలోనూ సైన్యం సోదాలు నిర్వ‌హించింది. అనేక మందిని ఆర్మీ అరెస్టు చేసింది. అయితే కొత్త అధ్య‌క్షుడు రాణిల్ విక్ర‌మ‌సింఘేకు వ్య‌తిరేకంగా కూడా నిర‌స‌న‌కారులు ఆందోళ‌న చేస్తున్నారు. వారిని అదుపు చేసేందుకు అద‌న‌పు బ‌ల‌గాల్ని మోహ‌రించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/