ఆర్ఆర్ఆర్ ఫై తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫ్యాన్స్ , నెటిజన్లు ఫైర్

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ , ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి ..తాజాగా ఆర్ఆర్ఆర్ ఫై చేసిన వ్యాఖ్యలఫై యావత్ సినీ ప్రేమికులు , అభిమానులు , నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తెలుగు సినిమా స్థాయిని వరల్డ్ వైడ్ గా పెంచిందని , ఇందులోని నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ కు నామినేట్ అయ్యిందని , అలాంటి ఈ సినిమా ఫై విమర్శలు చేయడం ఏంటి అని ప్రశ్నింస్తూ వారి రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

నేటి కాలంలో సినిమా మేకింగ్ అనేది ఎలా మారింద‌నే ప్రశ్న తమ్మారెడ్డి కి ఎదురుకాగా..దానికి ఆయన సమాధానం చెబుతూ.. ఆర్‌ఆర్‌ఆర్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ‘‘ఆస్కార్ ప్ర‌మోష‌న్స్ కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం ఏకంగా 80 కోట్లు ఖర్చు చేశారు. అదే 80 కోట్లు మాకు ఇస్తే ఓ 8 సినిమాలు తీసి వాళ్ళ మొఖాన కొడతాం’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే తమ్మారెడ్డిపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఒక తెలుగు సినిమాలోని పాట ఆస్కార్‌కు నామినేట్‌ అవ్వడం అంటే మాములు విషయం కాదు. కానీ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాట ఆ ఘనత సాధించింది. అలాంటి సినిమా ఫై తమ్మరెడ్డి ఆలా వ్యాఖ్యలు చేయడం సరికేదన్నారు.