భగవంత్ కేసరి లో శ్రీలీల పాత్ర హైలైట్ గా ఉండబోతుందట

పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల ..ప్రస్తుతం ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. ధమాకా చిత్రం అమ్మడి జతకన్నే మార్చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలతో అమ్మడు బిజీ గా ఉంది. ఆ సినిమాలన్నీ కూడా చిన్న చితక సినిమాలు కాదు మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ వంటి అగ్ర హీరోల చిత్రాలే.

బాలకృష్ణ – అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి లో శ్రీలీల పాత్ర హైలైట్ గా ఉండబోతుందట. శ్రీ లీల పాత్ర చుట్టూ కథ ట్విస్ట్ లు ఉంటాయని అంటున్నారు. ఈ పాత్రను అనీల్ రావిపుడి చాలా బాగా డిజైన్ చేశారని, అందుకే శ్రీ లీల పాత్ర గురించి ఎలాంటి హింట్ బయటకు రాకుండా చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారట. భగవంత్ కేసరి సినిమా శ్రీ లీల లోని మరో యాంగిల్ ని చూపిస్తుందని అంటున్నారు. సినిమా తర్వాత శ్రీ లీల రేంజ్ మరింత పెరుగుతుందని టాక్. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్ పెద్ది సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.