అయోధ్యలో భూమి పూజ.. భద్రాద్రిలో ప్రత్యేక పూజలు

ఎలాంటి ఆటంకం లేకుండా నిర్మాణ పనులు పూర్తికావాలంటూ ప్రత్యేక పూజలు

bhadrachalam-ram-temple

భద్రాచలం: ప్రధాని నరేంద్రమోడి అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మరికాసేపట్లో భూమి పూజ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రాచంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తికావాలని కోరుకుంటూ స్థానాచార్యుడు స్థలసాయి, ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు నేతృత్వంలో బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేడా మండపంలో సీతారామచంద్రుల వారిని ఆరాధించి అర్చన చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండలో నెయ్యి, సమిధలు సమర్పించి హోమం నిర్వహించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/