నేడు భద్రాచలం బంద్‌..

నేడు భద్రాచలం బంద్‌కు పిలుపునిచ్చారు భద్రాచలం గ్రామస్థులు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ జీవో జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ జీవో ను వ్యతిరేకిస్తూ గ్రామస్థులు నేడు బంద్ కు పిలుపునిచ్చారు. పాత గ్రామపంచాయతీని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ, నేడు భద్రాచలం బంద్‌ కు కాంగ్రెస్‌ మరియు వామపక్షాలు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని అలర్ట్ చేసారు.

భద్రాచలంలో చేపట్టిన బంద్‌లో ఎమ్మెల్యే పొదేం వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… భద్రాచలం ప్రతిష్ట దెబ్బ తిసేలా చేస్తున్న సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయన్నారు. భద్రాచలం పంచాయితీని మూడు పంచాయితీలుగా విభజన చేసిన జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రాలో కలిసిన ఐదు విలీన గ్రామాలను మళ్లీ తెలంగాణలో కలపడంలో సీఎం కేసీఅర్ విఫలమయ్యారన్నారు. భద్రాచలంను మేజర్ పంచాయతీగానే కొనసాగించాలన్నారు. భద్రాచలం పట్ల సీఎం కేసీఆర్‌కు చిన్న చూపు అని ఎమ్మెల్యే వీరయ్య వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ సర్కారు శుక్రవారం జారీ చేసిన కొత్త జీవో ప్రకారం భద్రాచలం మూడు గ్రామ పంచాయతీలుగా విడిపోయింది. భద్రాచలం సీతారామ నగర్, శాంతినగర్ పంచాయతీలుగా విభజించారు. దీంతో త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జీవో ప్రకారం 1 నుంచి 132 వరకు ఉన్న సర్వే నంబర్లను ఒక పంచాయతీగా, 52 నుంచి 90 వరకు ఉన్న సర్వే నంబర్లను రెండో పంచాయతీగా, 91 నుంచి 27 వరకు ఉన్న సర్వే నంబర్లను మూడో పంచాయతీగా మారుస్తారు. అదేవిధంగా సారపాక ప్రధాన పంచాయతీ కూడా రెండు పంచాయతీలుగా విభజించబడింది. సారపాక పంచాయతీలో 1 నుంచి 262 సర్వే నంబర్లు, ఐటిసి పంచాయతీలో 6, 14, 35 నుంచి 262 సర్వే నంబర్లు ఉన్నాయి. పరిపాలనా సులభతరం చేయడానికి పంచాయతీలను విభజించినట్లు అధికారులు తెలిపారు.