విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన

చంద్రబాబు రాకతో వైజాగ్ ఎయిర్ పోర్టు వద్ద కోలాహలం

chandrababu-gets-huge-welcome-at-vizag-airport

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లాలో మూడ్రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం ఆయన వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు టిడిపి శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. చంద్రబాబు రాక నేపథ్యంలో టిడిపి కార్యకర్తలు భారీ సంఖ్యలో వైజాగ్ విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. నినాదాలతో హోరెత్తించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. విమానాశ్రయం వెలుపల భారీ రద్దీ ఏర్పడింది.

కాగా, విజయనగరం జిల్లాలో చంద్రబాబు నేటి నుంచి ఈ నెల 24 వరకు పర్యటించనున్నారు. ఈ సాయంత్రం రాజాంలో రోడ్ షోతో ఆయన పర్యటన ప్రారంభం అవుతుంది. రాజాం సీబీఎం చర్చిలో జరిగే సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు.

ఈ నెల 23న బొబ్బిలి నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఓబీసీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల 24న విజయనగరంలో రోడ్ షోలు, రైతులతో సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం కోట జంక్షన్ లో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/