స్నేహితుడు గురించి చెబుతూ తీవ్ర భావోద్వేగాలకు గురైన పోచారం
నేడు పోచారం పుట్టినరోజు..అసెంబ్లీలో జన్మదిన కార్యక్రమం

హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. జన్మదినం సందర్భంగా అసెంబ్లీలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పోచారం… మొక్కలు నాటారు. ఈ సందర్భంగా, ప్రాణస్నేహితుడు సాలంబి నలిని గుర్తుచేసుకుని ఆయన తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. సాలంబి నలి హఠాన్మరణం తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
మీడియాతో మాట్లాడే సమయంలో ఆయన కన్నీటిని ఆపుకోలేకపోయారు. మిత్రుడి మరణం బాధాకరమని, నియోజకవర్గంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు కార్యక్రమాలను రద్దు చేసినట్టు పోచారం వెల్లడించారు. అసెంబ్లీలోనూ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోరాదని నిర్ణయించుకున్నానని, కానీ ఇక్కడ ముందే ఏర్పాట్లు చేసి ఉండడంతో జరుపుకోవాల్సి వచ్చిందని వివరించారు.