అంతరిక్ష రంగంలో భారత్‌ ముందంజ

ప్రైవేటు భాగస్వామ్యంతో మరింత ప్రయోజనం

India is a leader in the space sector
India is a leader in the space sector

విక్రం సారాభాయ్ ని భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు పితామహుడిగా అభివర్ణిస్తారు.

1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్‌ అయిన స్పుత్నిక్‌ను ప్రయోగించినప్పుడు శాటిలైట్‌ అవశ్యకతను అప్పటి ప్రధాన మంత్రి అయిన నెహ్రూకు వివరించి, 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడయిన హోమీబాబా పర్యవేక్షణలో ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌ను ఏర్పరచాడు.

కేరళలో తివేండ్రం వద్ద తుంబా ఈక్వటోరియల్‌ రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌ నెలకొల్పి అమెరికా, రష్యాల నుండి దిగు మతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ ఉపరితలాన్ని అధ్య యనం చేయడం మొదలుపెట్టారు.

అనతికాలంలోనే భారత దేశం స్వదేశీయంగా పూర్తిస్థాయి రాకెట్లను తయారు చేసి, ఉపరితల అధ్యయంలో పురోగతి సాధించింది.

ఉపగ్రహాలను తయారు చేయడమే కాకుండా వాటిని ప్రయోగించే సామర్థ్యాన్ని కూడా కలిగిఉండాల్సిన అవశ్యకతను గుర్తించిన సారా భాయ్, ఉపగ్రహ వాహకనౌక రూపకల్పన మొదలు పెట్టాడు.

అలా తయారైనదే సెటిలైట్‌ లాంచ్‌ వెహి కిల్‌, ఇస్రో తయారు చేసిన తొలిపూర్తిస్థాయి ఉప గ్రహానికి భారత గణిత, ఖగోళ శాస్త్రవేత్త అయిన ‘ఆర్యభట్ట పేరుపెట్టారు.

భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను 1975 ఏప్రిల్‌ 19న అప్పటి సోవియట్‌ యూనియన్‌ నుండి విజయవం తంగా ప్రయోగించారు.

ఇన్‌శాట్‌ లేదా భారత జాతీయ ఉపగ్రహ వ్యవస్థ అనేది సమాచారం, వాతావరణం, ప్రసా రాలు మొదలైన బహుళ ప్రయోజనాల కోసం ఇస్రో తయారు చేసిన ఉపగ్రహాల శ్రేణి.

1983లో మొదలైన ఇన్‌శాట్‌, ఆసియా, పసిఫిక్‌ దేశాల్లో అతిపెద్ద ఉపగ్రహాల వ్యవస్థ. ప్రస్తుతం 199 ట్రాన్స్‌ పాండర్లతో భారతదేశంలోని దాదాపు అన్ని టెలివిజన్‌, రేడి యోలకు మాధ్యమంగా ఉన్న ఈ ఉపగ్ర హాలను కర్ణాటకలోని హస్సన్‌, భోపాల్‌ల నుండి అనుక్షణం పర్యవేక్షిస్తుంటారు.

అంతరిక్ష రంగంలో అధునాతన సామ ర్థ్యాలు కలిగి ఉన్న కొన్ని దేశాలలో భారత్‌ ఒకటి. భారత్‌లో ప్రతిష్టాత్మక ప్రయోగ కేంద్రాలున్నాయి.

కేరళలో తిరువనం తపురం సమీపాన భూ ఆయస్కాంత రేఖకు దగ్గరలో ఉన్న తుంబాలో 1962లో మొదటి రాకెట్‌ ప్రయోగ కేంద్రాన్ని నిర్మించారు.

అప్పటి శాస్త్రవేత్తలలో అబ్దుల్‌కలాం ఒకరు. మొదట కేవలం రాకెట్ల ప్రయోగ కేంద్రంగా ఉన్న తుంబా నెమ్మదిగా రాకెట్లకు అవసర మైన ప్రొపెల్లర్లు, ఇంజన్లు తయా రు చేసి అమర్చగలిగి పూర్తి స్థాయి రాకెట్‌ నిర్మాణ కేంద్రంగా తయారయింది.

అలాగే భారతదేశంలో ఉపగ్రహాల ప్రయోగా నికి అత్యంత అనువైన ప్రదేశమైన శ్రీహరికోట నెల్లూరుజిల్లాలో సూళ్లూరుపేట దగ్గర ఉంది.

ఈ అంతరిక్ష కేంద్రం పేరు ‘సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం. దీనినే ‘షార్‌ అని కూడా పిలుస్తారు.

ఇది భారతదేశంలోని ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇక్కడ నుండి ఎన్నో పి.ఎస్‌.ఎల్‌.వి, జి.ఎస్‌.ఎల్‌.వి ఉపగ్ర హాలను విజయవంతంగా ప్రయోగించారు.

ప్రస్తుతం ఇక్కడ రెండు లాంచ్‌ ప్యాడ్‌లు ఉన్నాయి. ఈ రెండింటి వల్ల ప్రతి ఏడాది ఆరు శాటిలైట్లను ప్రయోగించే వీలు ఉంది.

ఒడిశాలో బలేశ్వర్‌లో కూడా శ్రీహరికోటలో ఉన్నట్లు శాటిలైట్ల ప్రయో గానికి సౌకర్యాలు లేకున్నా, దీనిని ప్రధానంగా క్షిపణులను ప్రయోగించుటకు ఉపయోగిస్తారు.

2005లో రెండవ లాంచి ప్యాడు ఆపరేషను, 2008లో చంద్రయాన్‌, 2014లో మంగళయాన్‌, 2016లో పునర్వినియోగ లాంచి వాహనపు తొలి పరీక్ష. 2016లో ఒకే రాకెట్‌తో 20 ఉపగ్రహాల ప్రయో గం, అప్పటికి ఇది ఇస్రోరికార్డు.

2017లో ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాల ప్రయోగం. ఇది ప్రపంచ రికార్డు. 2017లో జిఎస్‌ఎల్‌వి మార్క్‌ 3 ప్రయోగం, దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన క్రయోజెనిక్‌ ఇంజను విజయ వంతమైంది.

2019 డిసెంబర్‌ 11న పిఎస్‌ఎల్వీ-సి48ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రిసాట్‌2బిఆర్‌ఐతో పాటు 9 ఉపగ్రహాలను పిఎస్‌ఎల్వీ-సి48 వాహకనౌక నింగి లోకి మోసుకెళ్లింది.

ఆర్యభట్ట ఏప్రిల్‌ 19,1975తో ప్రారం భించి, జిసాట్‌-30 జనవరి 17,2020వరకు విజయవం తంగా ముందుకుసాగింది.

సరికొత్త భూ పరిశీలన ఉపగ్రహం ఇఒఎస్‌-01, తొమ్మిది అంతర్జాతీయ కస్టమర్‌ అంతరిక్ష నౌకలను నవంబర్‌ ఏడున ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష నౌక నుండి పిఎస్‌ఎల్వీ- సి49 రాకెట్‌పైకి ఎక్కించింది.

భారత అంతరిక్ష పరిశోధనలో విజయాలు, వరుస ఉపగ్రహ ప్రయోగాలు శాస్త్రవేత్తల పరిశోధనలకు మరింత ప్రోత్సాహాన్నిస్తున్నాయి.

ప్రసిద్ధమైన ఇస్రో సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభి వృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటై, ప్రస్తుతం ప్రపం చంలోని అంతరిక్ష రంగసంస్థల్లో ఒకటిగా పేరొం దింది. బెంగళూరు కేంద్రంగా ఏర్పాటైన ఇస్రో, దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు కలిగి ఉంది.

ఇస్రో భారత ప్రభుత్వపు అంతరిక్ష శాఖకు అనుబంధంగా ఉంది. అంతరిక్ష శాఖ ప్రధానమంత్రి, అంతరిక్ష కమిషన్‌ ఆధీనంలో ఉంటుంది.

ఇస్రో కింది విభాగాలను, సంస్థలను నిర్వహిస్తుంది. అంతరిక్ష కార్యకలాపాలలోకి ప్రైవేట్‌రంగాల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచే లక్ష్యంతో ప్రధాన మంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ అంతరిక్ష రంగంలో చాలా కీలకమైన సంస్కరణలకు ఆమోదం తెలిపింది.

భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ భాగస్వామ్యం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నిర్ణయంతో మన అంతరిక్ష విజ్ఞానాన్ని దేశాభివృద్ధికి ఉపయోగించుకునే సామర్థ్యం మరింతగా పెరుగుతుంది.

మన అంతరిక్ష రంగం త్వరితగతిన అభివృద్ధి చెందటమే కాకుండా, అంతరిక్ష ఆర్థిక వ్యవహారాల్లో భారత్‌ అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించేందుకు వీలవుతుంది.

  • రామకష్టయ్య సంగనభట్ల

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/