ప్రజావాక్కు: సమస్యలపై గళం

Voice of the people
Voice of the people

హేతుబద్ధతలేని వాదన!:- గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్ల్లా

కోటిన్నర మందే పన్ను చెల్లిస్తే ఎలా అని ప్రధాని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది. ప్రజలు తాము కొనుగోలు చేస్తున్న వంట గ్యాస్‌ నుండి మాట్లాడుతున్న ఫోన్‌ సంభాషణలకు సైతం పన్నులు చెల్లిస్తున్నారు. ఆ మాటకు వస్తే తాము కొనే ప్రతివస్తువ్ఞపైనా, పొందుతున్న సేవలపైనా పన్నులు పడుతు న్నాయి.ప్రధానమంత్రి గత ఆరు సంవత్సరాలుగా ఇదే వాదన చేస్తున్నారు.అసలు తాము ప్రజలకు ఏయే వాగ్దానాలు చేశాం, ఎంతవరకు నెరవేర్చాం అన్న విషయాన్ని మరిచారు! వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు తీసుకున్నవారు చెల్లించకపో యినా చట్టాలకు పదునుపెట్టి రుణాల ఎగవేతను ఆరికట్టలేక పోయారు. వేలకోట్లు దోచుకున్న వారిపై పెట్టిన కేసులు సంవ త్సరాల తరబడి పరిష్కారం కావడంలేదు. ఇలాంటి కీలకమైన అంశాలను గాలికి వదిలి, నోట్ల రద్దు, భారీ జిఎస్టీ, పన్నులతో సామాన్యుల బతుకులు దుర్భరం చేశారు.

సవతి తల్లి ప్రేమ:-మిథునం, హైదరాబాద్‌

ఎప్పటిలానే ఈసారి కూడా కేంద్ర బడ్జెట్లో రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎపి, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన మంత్రులు కూడా కేంద్రం బడ్జెట్‌ మాకు నిరాశను మిగిల్చిందని, మా రాష్ట్రాలకు అరకొర నిధులను మంజూరు చేసిచేతులు దులుపుకున్నారని వాపోయారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు తెలుగు రాష్ట్రాలు నిర్లక్ష్యానికి గుర వ్ఞతున్నాయనే మాటనిజం.ఈ రాష్ట్రాలలో ఆపార్టీ ప్రభుత్వాలు అధికారంలో లేకపోవటమే ఇందుకు కారణం కావచ్చు. తెలుగు రైతులకు కూడా ఈ బడ్జెట్‌ ఒరగబెట్టిందేమీ లేదు. కనీసం వారి పట్లనైనా కన్నతల్లి ప్రేమను కనబరిస్తే బావ్ఞండేది.

‘మీ సేవలను మెరుగుపరచాలి:-కొవ్వూరు వెంకటేశ్వరప్రసాద్‌, కందుకూరు

ప్రజలకు అందుబాటులోఉండేవిధంగా గ్రామలెక్కలు అన్నీ మీసేవద్వారా అందించాలి.విక్రయపత్రాలు, ఆర్‌.ఎస్‌.ఆర్‌. ఆర్‌.హెచ్‌.ఒ రికార్డుల అప్‌హోల్డింగ్‌ మొదలగునవి తప్ప నిసరిగా మీ సేవలో అందుబాటులో ఉండేవిధంగా చూడా ల్సిన బాధ్యత ప్రభుత్వంపైఉంది. అంతేకాకుండా మండల కార్యాలయం చుట్టూ తిరగలేక ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.తక్షణమేస్పందించి వారికి అవసరమైన సమాచారాన్ని అంతా మీ సేవ ద్వారా పొందేవిధంగా చర్యలు చేపట్టాలి.

ఒత్తిడిని దూరం చేయాలి: -సయ్యద్‌ షఫీ, హన్మకొండ

మరో రెండు వారాల్లో ఇంటర్మీడియేట్‌, పదవ తరగతి విద్యా ర్థుల పరీక్షలు ప్రారంభం అవ్ఞతాయి. ఇక విద్యార్థులు అనగానే టెన్షన్‌ పడుతుంటారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలని ఒత్తిడి చేస్తుంటారు. పిల్లలు పరీక్షలు అనగానే నిద్ర, ఆహారం తీసుకోవడం మానేసి చదువ్ఞతుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తోంది. జ్ఞాపకశక్తిని కోల్పోతారు. పిల్లలు మొదటి నుండిప్రణాళిక ప్రకారం చదువ్ఞకోవడం చేయాలి. ఇక తల్లిదం డ్రులు,ఉపాధ్యాయులు పిల్లలకు కౌన్సిలింగ్‌ద్వారావారిలో ఆత్మ విశ్వాసం కలిగించాలి. బాగా మార్కులు తెచ్చుకోవడం కాదు వారిలోని ఆత్మనూన్యత దూరం చేసి పిల్లలకు మనోధైర్యం, పరీక్షల సమయంలో వారికి సూచనలు, సలహాలు ఇవ్వడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఆయుధాల అపహరణ:-కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్‌, భూపాలపల్లి జిల్లా

సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలానికి చెందిన ఒక వ్యక్తి ఆధాయులపై ఉన్న మోజుతో పోలీసు స్టేషన్‌ నుంచి 2016లో ఏకె 47ను,25 బుల్లెట్లనుదొంగలించాడు. ఇటీవల మరోవ్యక్తితో వివాదం ఏర్పడినప్పుడు తనదగ్గర ఉన్న ఎకె47ను ఉపయోగిం చి కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో పోలీసు అధికారుల నిర్లక్ష్యంస్పష్టంగా వెల్లడవ్ఞతుంది.హుస్నాబాద్‌స్టేషన్‌లో పోలీసు లు ఎంత అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారో తెలుస్తుంది. చోరికిగురైన ఆయుధాన్ని నిందితుడు అందరి కళ్లుగప్పి పోలీసు స్టేషన్‌నుండి దర్జాగా ఎలాదొంగిలించాడని అందరి ప్రశ్న? 4 సంవత్సరాల క్రితం అపహరణకు గురైన ఆయుధాన్ని పోలీ సులు ఎందుకు విచారణ చేపట్టలేదో అర్థకావడంలేదు. అక్కన్న పేటఆయుధాల ఘటనపై పూర్తిస్థాయివిచారణ చేపట్టాలి.మరో మారు ఇలాంటిఘటనలు జరగకుండాచర్యలు తీసుకోవాలి.

మైనింగ్‌ శాఖ కళ్లు తెరవాలి: -రాజేందర్‌ దామెర, వరంగల్‌

వరంగల్‌ జిల్లాలో బోర్‌బ్లాస్టింగ్‌లు యధేచ్ఛగా చేపడు తూ నే ఉన్నారు. కొత్తగట్టు, మల్కపేట గ్రామ పరిధిలోని స్టోన్‌ క్రషర్‌పై ఆ గ్రామప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధితశాఖలకు విన్నపాలు అందినాకూడా కనీస చర్య లు కానీ, విచారణ కానీ చేపట్టడం లేదంటే అధికారులకు మనుషుల కంటే స్టోన్‌ క్రషర్ల మీదే మక్కువ ఎక్కువగా ఉన్నట్లు ఉంది. స్టోన్‌ క్రషర్ల పన్ను చెల్లింపుపై ఐటిరిటర్న్‌, ఆడిట్‌ లెక్కలపై సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. మైనింగ్‌ శాఖ కళ్లు తెరవాలి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/