చరిత్ర సృష్టించిన బైడెన్‌

‘వార్తల్లోని వ్యక్తి’- ప్రతి సోమవారం

Joe Biden
Joe Biden

చరిత్రాత్మకమైన అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు ముగిశాయి. అమెరికాతో సహా ప్రపంచమంతా కోరుతున్నట్టుగానే డెమొక్రాటిక్‌పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ గెలిచాడు. ఎప్పుడు పోతాడా అని ఎదురు చూసిన డొనాల్డ్‌ ట్రంప్‌ వదిలిపోయాడు.

అందరికంటే పెద్ద

అమెరికాకు ఇంతవరకు అధ్యక్షులైన వారిలో బిడెన్‌ అందరికంటె వృద్ధుడు. ఈసారి విశేషమేమిటంటే, ఒక మహిళా మణి కమలా హారిస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలైనది.

అంతేకాదు ఆమె మూలాలు భారతీయం. అందులోను ఆమె తల్లి తమిళనాడుకు చెందినవారు. ఇది పెద్ద విశేషం. ఇంతవరకు ఇలాంటిది జరగలేదు.

బైడెన్‌.. ట్రంప్‌ వలె కాదు:

ఆయన అధ్యక్షుడు ఎన్నిక కాగానే చాలా హుందాతనంతో తన అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రత్యర్థులే కాని,శత్రువులం కాదు అధ్యక్ష ఎన్నిక అయిపోయింది. మేము ప్రత్యర్థులుగా పోటీ చేశామేకాని, శత్రువులుగాకాదు. గతాన్ని మరిచిపోదాం.

అందరం కలిసి, నవ అమెరికాను నిర్మిద్దాం. పోటీ ఎన్నికలలోనే కాని, శాశ్వతంగా కాదు బిడెన్‌ ప్రకటన ఎంత హుందాగా ఉన్నది! ఆయనకు అమెరికా కాంగ్రెసు సభ్యుడుగా 50 సంవత్సరాల అనుభవం ఉన్నది.

సెనెటర్‌గా ఎన్నికైనప్పుడు అందరికంటె పిన్నవయస్కుడు. ఇప్పుడో? అమెరికా అధ్యక్షులైన వారందరిలో పెద్దవాడు(77).ఆయన 1942లో పెన్సిల్వేనియా రాష్ట్రంలో నవంబర్‌ 20న జన్మించారు.

పిన్నవయస్సులోనే రాజకీయాలలో ప్రవేశించారు. బరాక్‌ ఒబామా అధ్యక్షుడుగా వ్ఞన్నప్పుడు బిడెన్‌ రెండుసార్లు ఉపాధ్యక్షుడు. బిడెన్‌ లాయర్‌.

29వ సంవత్సరంలోనే 1972లో డెలావర్‌ రాష్ట్రంలో సెనెటర్‌గా వున్నారు. దేశంలోనే అంత చిన్న వయస్సులో సెనెటర్‌గా వున్న వారు వీరు.

దురదృష్టవంతుడు

ఒక విధంగా ఆయన దురదృష్టవంతుడు కూడా. ఆయన ఆస్తిపాస్తులు చాలా తక్కువ.

కారు ప్రమాదంలో ఆయన పెద్ద భార్య, నెలల వయస్సులో ఉన్న కుమార్తె మరణించారు. 1977లో రెండో పెళ్లి. ఆమె పేరు జిఇల్‌ జాకబ్స్‌.

ఈ సంబంధానికి ఒక కుమార్తె ఇద్దరు కుమారులు. కాని, ఈ విషయంలో కూడా ఆయన దురదృష్టం తిరిగి వెన్నాడింది.

కుమారులిద్దరిలో ఒకరు బ్రెయిన్‌ ట్యూమర్‌తో మృతి చెందారు.బిడెన్‌ వయస్సు 77 సంవత్సరాలు.

  • డాక్టర్‌ తుర్లపాటి కుటుంబరావు, (‘పద్మశ్రీ అవార్డు గ్రహీత)

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/