రేపు చంద్రగ్రహణం.. 11 గంటలపాటు శ్రీవారి ఆలయం ముసివేత

Tirumala Temple
Tirumala Temple

తిరుమలః రేపు(మంగళవారం) చంద్రగ్రహణం సంభవించనుండటంతో తిరుమల శ్రీవారి క్షేత్రం మరోసారి మూతపడనుంది. ఆలయాన్ని సుమారు 11 గంటలపాటు మూసివేయనున్నారు. ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఇటీవలే పాక్షిక సూర్యగ్రహణం కారణంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.

చంద్రగ్రహణం కారణంగా ఈనేపథ్యంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందులోభాగంగా నేడు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. బ్రేక్‌దర్శనాలు, ఆర్జితసేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా రద్దు చేసింది. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి.. శుద్ధి చేసిన తర్వాత వైకుంఠం-2 క్యూకాంప్లెక్స్‌ ద్వారా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/