సౌత్ సినిమాలను ఆకాశానికి ఎత్తుతూ.. హిందీ సినిమాల పై షాకింగ్ కామెంట్స్ చేసిన సోనూసూద్

విలన్ గా చిత్రసీమలోకి అడుగుపట్టిన సోనూసూద్..కరోనా సమయంలో ఎంతోమందిని కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడు. అప్పటి నుండి ఆపదలో ఉన్న వారికీ ఆర్ధిక సాయం చేస్తూ వస్తున్న ఈయన..తాజాగా బాలీవుడ్ చిత్రాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. బాలీవుడ్ లో చెత్త సినిమాలు చేయకుండా సౌత్ సినిమాలు తనని కాపాడినట్టు చెప్పుకొచ్చారు. తాను హిందీతో పాటు సౌత్ లోనూ నటించానని, ఒకానొక సమయంలో బాలీవుడ్ ని వదిలేసి దక్షిణాది సినిమాలు మాత్రమే చేశానని తెలిపారు సోనూ సూద్.

అప్పట్లో అందరూ తనని సౌత్ లో ఎందుకు సినిమాలు చేస్తున్నావని ప్రశ్నించే వారని, అనుభవం కోసం చేస్తున్నా అని చెప్పినట్లు తెలిపారు. ప్రజలు సినిమా బాగా ఉంటేనే ఆదరిస్తారని తెలిపారు. ఇటీవల ఆచార్య లో విలన్ గా మెరిసిన సోనుసూద్ ప్రస్తుతం హిందీలో పృధ్విరాజ్ చిత్రంలో నటించారు. ఇందులో ఆయన చాంద్ బర్దాయి పాత్రలో కనిపించబోతున్నారు. ఇక హిందీ చిత్రాలపై సోను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.